ఏంటి ట్రంప్ భయ్యా..మోడీకి ఈ టార్చర్..? సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూ, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. గతంలో నమస్తే ట్రంప్, హుడీ-మోడీ పేరుతో పరస్పరం తమ దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించి మరీ వీరిద్దరూ తమ అనుబంధాన్ని కూడా చాటుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈసారి ట్రంప్ భారత ప్రధాని మోడీని దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రమాణస్వీకారానికి సైతం మోడీకి ఆహ్వానం లభించలేదని తెలుస్తోంది.

అలాగే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ట్వీట్ కు కూడా ట్రంప్ నుంచి స్పందన లేదని తెలుస్తోంది. ఇవే అంశాల్ని ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన ట్రంప్ ఉద్దేశాన్ని ప్రశ్నించారు. అంతే కాదు ట్రంప్ కూ, మోడీకి ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేశారు. అలాగే మోడీ ట్రంప్ కు పెట్టిన ట్వీట్ ను కూడా తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.

former cbi director Nageswara rao vows trump for not inviting pm modi for his inaguration

సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తన ట్వీట్ లో .. మిస్టర్ డొనాల్డ్ జె.ట్రంప్, మీరు అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మీకు శుభాకాంక్షలు తెలిపి 3 రోజులైంది. ఆయన మిమ్మల్ని తన "ప్రియమైన స్నేహితుడు" అని పేర్కొన్నందున, మీరు అతనిని మీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనందున నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆయన ఆరోగ్యం దృష్ట్యా, కనీసం అతని అభినందన పోస్ట్‌ని గుర్తించాలని కోరారు. గుర్తిస్తే ధన్యవాదాలు అన్నారు.

అలాగే ట్రంప్ కు సన్నిహితంగా మారిన మాజీ ప్రత్యర్ది ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి ఎలాన్ భాయ్, మా మోడీ సోదర భావాన్ని నమ్ముతారని, తప్పలు జరుగుతూనే ఉంటాయి. కానీ ట్రంప్ ను ఇంత మొండిగా వ్యవహరించద్దని చెప్పండి అంటూ నాగేశ్వరరావు తన ట్వీట్ ను ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+