వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM Seat: సీఎం కుర్చీకి వాస్తు దోషమా ?, మల్టీఫ్లెక్స్ థియేటర్ లో సినిమా ?, చరిత్రలో ఒకేఒక్కడు, రికార్డు !

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్/న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం అట్టహాసంగా ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ రావత్ ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తరాఖండ్ రాస్ట్రం ఏర్పాటు అయిన తరువాత అక్కడ ముఖ్యమంత్రి కుర్చీకి వాస్తు దోషం ఏమైనా ఉందా ? అనే విషయం అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ లో 9 మంది మఖ్యమంత్రులు బాధ్యతలు స్వీకరించినా ఒక్క నాయకుడు మినహా ఎవ్వరు కూడా ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చెయ్యలేదు. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో సినిమాలు ఎలా వచ్చి ఎలా వెళ్లిపోతాయో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే 5 ఏళ్ల పదవి కాలం పూర్తి చేసుకుని ఆ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒకేఒక్కడిగా నలిచిపోవడం విశేషం.

Illegal affair: అత్తా, అల్లుడి అక్రమ సంబంధం, లేచిపోయి పెళ్లి, ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను ?Illegal affair: అత్తా, అల్లుడి అక్రమ సంబంధం, లేచిపోయి పెళ్లి, ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను ?

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు

2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. 2000లో ఉత్తరాఖండ్ తాత్కాలిక శాసన సభ ఉంది. ఉత్తరాఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నిత్యానందస్వామి బాధ్యతలు స్వీకరించారు. నిత్యానందస్వామి ముఖ్యమంత్రిగా 09-11-2000 నుంచి 29-10-2001 వరకు పదవి కాలంలో కొనసాగారు.

ఉత్తరాఖండ్ లో ఎన్ డీ. తివారి రికార్డు బ్రేక్

ఉత్తరాఖండ్ లో ఎన్ డీ. తివారి రికార్డు బ్రేక్

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు సీఎం పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తిగా నారాయణ్ ధత్ తివారి (ఎన్ డీ తివారి) రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 02-03-2002 నుంచి 07-03-2007 వరకు ఎన్ డీ. తివారి ఆయన పదవి కాలాన్ని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ప్రతినిత్యం ముఖ్యమంత్రులను మార్చే సాంప్రధాయం కొనసాగించే కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ లో ఎన్ డీ. తివారి విషయంలో మాత్రం జోక్యం చేసుకోలేదు.

 ఇద్దరు సీఎంలను మార్చిన బీజేపీ

ఇద్దరు సీఎంలను మార్చిన బీజేపీ

2007లో ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2007లో భవన్ చంద్ర ఖండూరి 111 రోజులు సీఎంగా ఉన్నారు. తరువాత రమేష్ పోక్రియాల్ 2 సంవత్సరాల 75 రోజులు సీఎంగా ఉన్నారు. తరువాత మళ్లీ భవన్ చంద్ర ఖండూరి 184 రోజులు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ లోల్లి

సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ లోల్లి

2012లో ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. విజయ్ బహుగుణ 13-03-2012 నుంచి 31-01-2014 వరకు సీఎంగా కొనసాగారు. తరువాత హరీష్ రావత్ 184 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగినా మధ్యలో కొంతకాలం రాష్ట్రపతి పాలన అమలు చెయ్యడంతో ఆయన వరుసగా ముఖ్యమంత్రిగా కొనసాగలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైకమాండ్ ఆదేశాలతో రాజీనామా

హైకమాండ్ ఆదేశాలతో రాజీనామా

2017లో ఉత్తరాఖండ్ లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. 4 సంవత్సరాల పాటు త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగి నాలుగు నెలల క్రితం బీజేపీ హైకమాండ్ సూచనలతో ఆయన పదవికి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో మళ్లీ కొత్త ముఖ్యమంత్రి పేరు తెరమీదకు వచ్చింది.

సీఎం కుర్చీకి వాస్తు దోషమా ?

సీఎం కుర్చీకి వాస్తు దోషమా ?

ఇప్పుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించడానికి సిద్దం అయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 మంది ముఖ్యమంత్రులు టపాటపా అంటూ వచ్చి వెళ్లిపోయారు. బహుషా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కుర్చీకి వాస్తు దోషం ఏమైనా ఉందా ? అనే విషయం అర్థం కావడం లేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.

English summary
Former Chief Ministers of Uttarakhand: ND Tiwari is only one Uttarakhand CM has completed full 5 year term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X