వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ హింస .. జస్టిస్ మురళీధర్ బదిలీపై రగడ .. మాజీ సీజేఐ బాలకృష్ణన్ ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ హింస నేపధ్యంలో ముగ్గురు బిజెపి నాయకుల విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమైనందుకు జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 26 న ఆగ్రహం వ్యక్తం చేసిన మర్నాడే కేంద్ర న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖ ఆయనకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.ఇక మురళీధర్ బదిలీ రాజకీయదుమారం రేపుతుంది. ఇక ఈ వివాదం నేపధ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ "అర్ధరాత్రి" ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు ప్రభుత్వం "కొంచెం జాగ్రత్తగా" వ్యవహరించాల్సింది అని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె జి బాలకృష్ణన్ అన్నారు.

సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకి సిఫారసు చేసిందన్న బాలకృష్ణన్

సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకి సిఫారసు చేసిందన్న బాలకృష్ణన్

ఇక ఈ బదిలీపై స్పందించిన సర్కార్ ఎటువంటి కేసుతో ఈ బదిలీకి సంబంధం లేదని పేర్కొంది. ఇక మురళీధర్ బదిలీకి సిఫారసు ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం చేసిందని న్యాయమూర్తి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొంది. ఇక ఇదే విషయాన్ని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ మాట్లాడుతూ, ద్వేషపూరిత ప్రసంగాలపై ఉత్తర్వులు జారీ చేసిన రోజున తుది బదిలీ నోటిఫికేషన్ ఇవ్వటం కేవలం యాదృచ్చికం అని, ఎందుకంటే మురళీధర్ బదిలీని వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించిందని పేర్కొన్నారు. కొలీజియం ముందుకు బదిలీ వ్యవహారం ఏ తేదీన వచ్చిందో తనకు తెలియదని పేర్కొన్నారు.

మురళీధర్ బదిలీకి ఢిల్లీ హింసపై కేసు విచారణకు సంబంధం లేదన్న మాజీ సీజేఐ

మురళీధర్ బదిలీకి ఢిల్లీ హింసపై కేసు విచారణకు సంబంధం లేదన్న మాజీ సీజేఐ


జస్టిస్ మురళీధర్ బదిలీకి ఢిల్లీ హింస కేసు విషయంలో ఆయన చేసిన విచారణకు సంబంధం లేదని మాజీ సిజెఐ అన్నారు.దేశంలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉన్నప్పుడు మరియు మీడియా మరియు ఇతరులు చురుకుగా ఉన్నప్పుడు, ప్రజలు అర్ధరాత్రి బదిలీ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రజలు వేరే విధంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు భిన్నంగా అర్థం చేసుకోగలరు అని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 డి ఎన్ పటేల్ సెలవులో ఉన్నందునే మురళీధర్ విచారించారన్న మాజీ సిజేఐ

డి ఎన్ పటేల్ సెలవులో ఉన్నందునే మురళీధర్ విచారించారన్న మాజీ సిజేఐ

అంతేకాకుండా ఢిల్లీ హింస కేసును జస్టిస్ మురళీధర్ స్వయంగా తీసుకోలేదని ఆ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి ఎన్ పటేల్ సెలవులో ఉన్నందున, అతను మూడవ సీనియర్ న్యాయమూర్తి కావడంతో, ఈ కేసును విచారించిన ప్రత్యేక ధర్మాసనానికి జస్టిస్ మురళీధర్ నేతృత్వం వహించారు. జస్టిస్ మురళీధర్ ను మరుసటి రోజు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో చేరమని కోరినట్లు తాను భావించడం లేదని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ అన్నారు.సాధారణంగా అటువంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడినప్పుడు, బదిలీ చేసిన న్యాయమూర్తి కొత్త పోస్టింగ్ కోసం తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఏడు రోజుల సమయం ఇవ్వబడుతుందని జస్టిస్ బాలకృష్ణన్ తెలిపారు.

English summary
The government should have been a “little careful” while issuing the “midnight” order transferring Delhi High Court Judge S Muralidhar to the Punjab and Haryana High Court, former Chief Justice of India Justice K G Balakrishnan has said, amid a row over the timing of the transfer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X