మహిళలకు ద్రోహం చేసి రేపిస్టులకు న్యాయం చేస్తారా ?, సీఎంను నిలదీస్తున్న మాజీ సీఎం, మార్చకుంటే !
నేరస్తును కాపాడటం కోసం సీఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని అనుమానం ఉందని మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేర కార్యకలాపాలకు పాల్పడిన వారిని రక్షించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. ఓట్ల కోసం మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతారా ? అంటూ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రశ్నించారు.
శనివారం కర్ణాటకలోని హనగల్‌లో గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు విషయంలో నిరసన వ్యక్తం చేసిన మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ విలేకరులతో మాట్లాడుతూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో నేరగాళ్లు ఎక్కువ అవుతున్నారని, వాళ్ల బెడద పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేరం చేసిన వారి వర్గంలో ఓటు బ్యాంకు ఉందని, అందుకే కేసు దర్యాప్తు పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

గ్యాంగ్ రేప్ విషయంలో హానగల్‌లో పెద్దఎత్తున నిరసనలు, ధర్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా పోలీసు శాఖ కళ్లు మూసుకుని నిద్రపోతున్నదని, గ్యాంగ్ రేప్ కేసును పక్కాగా విచారిస్తున్నామని పైకి మాత్రం అంటున్నారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇద్దరు పోలీసులను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సిద్దరామయ్య ప్రభుత్వం గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు విషయంలో పద్దతి మార్చుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. అత్యాచార బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని,. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగించాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక్ కూడా పాల్గొంటారు. బాధితులు చేస్తున్న ఈ పోరాటానికి సిద్దరామయ్య ప్రభుత్వం తలొగ్గకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దరామయ్య ప్రభుత్వం గ్యాంగ్ రేప్ కేసు నిందితులను కాపడటానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు రేపిస్టులకు అండగా నిలుస్తున్నారని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications