యడ్డీకి బిగుసుకుంటోన్న ఉచ్చు
Yediyurappa: కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చిక్కుల్లో కూరుకుపోయారు. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇందులో నుంచి బయటపడటానికి గతంలో చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి.
యడియూరప్పపై నమోదైన పోక్సో కేసు విషయంలో సీఐడీ అధికారులు ఆయనను విచారించనున్నారు. ఇదివరకే ఆయనకు నోటీసులను జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఈ ఉదయం 11 గంటలకు బెంగళూరులో సీఐడీ అధికారుల విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే నిలిచింది.

పోక్సో కేసులో యడియూరప్ప ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు గానీ అవి వృధా అయ్యాయి. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది బెంగళూరు కోర్టు. దీనితో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఓ మహిళ..యడియూరప్పపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా తమపై ఛీటింగ్ కేసు నమోదైందని, దీని నుంచి తమను ఆదుకోవాలంటూ ఆ మహిళ తన కుమార్తెతో కలిసి యడియూరప్ప ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అప్పట్లో. బాధిత మైనర్, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యడియూరప్పపై పోక్సో, ఐపీసీలోని సెక్షన్ 354 ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల తరువాత బాధిత బాలిక తల్లి కేన్సర్‌తో మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఈ కేసు పెట్టారంటూ యడియూరప్ప కొట్టిపారేశారు. విచారణను ఎదుర్కొంటాననీ అన్నారు.












Click it and Unblock the Notifications