మూడు నెలల్లో రాజకీయాల్లో సీన్ రివర్స్, రూ. 70 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ?, కుమార !
బెంగళూరు/రామనగర: కర్ణాటకలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. శనివారం సిద్దరామయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే రెండు మూడు నెలల్లో రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తాయని, అంత వరకు అందరూ వేచి చూడాలని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ దళపతి హెచ్ డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందోని, ప్రభుత్వం ఏర్పాటు అయినా ఆ నాయకులు ప్రజలకు ఉత్తమ పరిపాలన అందిస్తారని నాకు నమ్మకం లేదని కుమారస్వామి అన్నారు. తన నియోజక వర్గంలో పనులు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు తాను చేతులు కట్టుకుని నిలబడలేనని, తన పని తాను చేస్తానని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

లోక్ సభ ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉందని, అంతవరకు ఓపికగా ఉండాలని జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కుమారస్వామి చూసించారు. త్వరలో తాలుకా పంచాయితీ, జిల్లా పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని, జేడీఎస్ పార్టీ నాయకులు ఆ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని, అందుకు ఇప్పటి నుంచి పని చెయ్యాలని కుమారస్వామి కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ స్కీమ్ లు అమలు చెయ్యాలంటే రూ. 60 వేల కోట్ల నుంచి రూజ 70 వేల కోట్ల రూపాయలు డబ్బులు అవసరం అని, ఆ డబ్బులు వీళ్లు ఎక్కడి నుంచి తెచ్చి గ్యారెంటీ స్కీమ్ లు అమలు చేస్తారో మేము చూస్తామని, ప్రజలను మోసం చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

డీకే శివకుమార్ ను సీఎం చెయ్యకుండా ఉప ముఖ్యమంత్రిని చేశారని మీడియా ప్రశ్నించగా కుమారస్వామి ఇలా సమాధానం ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం దానికినాకు సంబంధం లేదని అన్నారు. ఒక్కలిగ స్వామీజీలు డీకే శివకుమార్ ను సీఎం చెయ్యాలని చెప్పారు కదా అని మీడియా ప్రశ్నించింది. అభిమానంతో స్వామీజీలు అలా చెప్పి ఉంటారని, అందులో తప్పు లేదని పరోక్షంగా డీకే శివకుమార్ మద్దతు పలికిన కుమారస్వామి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దం అని అన్నారు .












Click it and Unblock the Notifications