కాఫీ, టిఫిన్ టైమ్‌ల్లో అత్యాచారం వార్తలే: ఈశ్వరప్ప
బెంగళూరు: కర్ణాటకలో నిత్యం అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి ఈ ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రేప్ వార్తలకు ఎక్కువ ప్రచారం చేస్తున్న మీడియా మీద ఆంక్షలు విధించాలని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలిలో ప్రతపక్ష నాయకుడు కే.ఎస్. ఈశ్వరప్ప మండిపడ్డారు.
శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్ల చిన్నారి దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్దురాలి మీద అత్యాచారాలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ అత్యాచారాలను కొన్ని దిన పత్రికలు మొదటి పేజీలో ప్రచురిస్తున్నాయని ఆరోపించారు.

అదే విదంగా ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం పదేపదే ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తూ ఎక్కువ ప్రధాన్యత కల్పిస్తున్నాయని, మీడియాకు కళ్లెం వెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి రేజు కాఫీ తాగేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడూ ఇలాంటి వార్తలే కనపడుతున్నాయని ఆరోపించారు.
లైంగిక దాడులతో పాటు రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ లు ఎక్కువ అయ్యాయని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుని మాకెందుకులే అని ఎలాంటి చర్యలు తీసుకోకుండ నిర్లక్షం చేస్తున్నదని విరుచుకుపడ్డారు.
టిప్పు సుల్తాన్ జయంతి సందర్బంగా మడికేరిలో జరిగిన అల్లర్లలో ఇద్దరు చనిపోయారని, ఈ విషయంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఒక వర్గం వారు దేశద్రోహానికి పాల్పడుతున్నా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కే.ఎస్.ఈశ్వరప్ప ఆరోపించారు.












Click it and Unblock the Notifications