బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి ?, మైనింగ్ కింగ్ ఏం చెప్పారంటే ?, ఆట మొదలైయ్యింది, రెడ్డి !
బెంగళూరు: బీజేపీ కర్ణాటక రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జోరుగా శ్రీకారం చుట్టారు. మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ డ్డిని మళ్లీ బీజేపీలోకి తీసుకునేందుకు బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయమై మాజీ మంత్రి, మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు.
నాతో ఏ జాతీయ పార్టీ చర్చలు జరపలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని, నన్ను ఏ ప్రాంతీయ పార్టీతోనూ పోల్చవద్దని, పరిస్థితిని బట్టి మేము మారబోమని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని, త్వరలో అన్ని విషయాలు తాను మాట్లాడుతానని, లోక్ సభ ఎన్నికల విషయం గురించి మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

తాను బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తనకు నాలుగు నెలల సమయం మాత్రమే చిక్కిందని, తాను బళ్లారి వెళ్లలేని పరిస్థితిలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు మంచి పోటీ ఇచ్చామని, ప్రాంతీయ పార్టీలు ఒకటి లేదా రెండు సీట్లతో ప్రారంభమవుతాయని, మా పార్టీ కూడా ఒక్కసీటులో విజయం సాధించిందని, తాను మళ్లీ విధానసౌధలో అడుగుపెట్టానని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

బీజేపీ కూడా చాలా ఏళ్ల క్రితం కేవలం రెండు సీట్లతో ప్రారంభమైందని, ఈరోజు కేఆర్ పీ ఒక స్థానం నుంచి ప్రారంభమైందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మేము రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు దగ్గర అవుతామనే నమ్మకం నాకుందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను ఎంతో నమ్మకంతో గంగావతి అసెంబ్లీ నియోజక వర్గానికి వెళ్లానని, అక్కడి ప్రజలు తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇతరులగా నేను రెండు, మూడు నియోజక వర్గాల్లో పోటీ చెయ్యలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
గంగావతి అసెంబ్లీ నియోజక వర్గంలో జాతీయ పార్టీలను ఓడించిన హిందూ, ముస్లీం సోదరుల తనను గెలిపించారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుందని, కచ్చితంగా తాము 100 నుంచి 113 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
కర్ణాటకలో ప్రాంతీయ పార్టీలు ఇంతవరకు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదని, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాలేవని ఇంతకాలం చెప్పిన జాతీయ పార్టీల మాటలను తాను తిరగరాస్తానని, కేఆర్ పీ కచ్చితంగా స్వతంత్రగా కర్ణాటకలోకి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు. మొత్తం మీద తాను మళ్లీ బీజేపీకి వస్తానని జరుగుతున్న ప్రచారం విషయంలో మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులకు జలక్ ఇచ్చారు. కర్ణాటకలో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో బిజీగా ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications