రేయ్ నువ్వు మొగుడేనా ?, భార్య కొట్టిన పంచ్ లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రాణం పోయింది !

పూణే/మహారాష్ట్ర: భర్త పీకలదాక తాగేసి ఏదైనా మరిచిపోయినా భార్య పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవాన్ని మర్చిపోకూడదని చాలా మంది తరచుగా బుద్దిమాటలు చెబుతుంటారు. అలా చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని, కాపురంలో గొడవలు వస్తాయని, నువ్వు ఎంత మందుతాగినా నీ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్నేహితులు భర్తలకు సలహాలు ఇస్తుంటారు. ఈ రెండు రోజుల్లో భార్యలు వారి భర్తల నుంచి బహుమతులు కోరుకుంటారు.

ఇక్కడ భార్య పుట్టిన రోజు వేడుకల విషయంలో నిర్లక్షం చేసి ఓ కోటీశ్వరు చివరికి అతని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన పుట్టిన రోజు జరుపుకునేందుకు తనను దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించినందుకు ఓ భార్య ఆమె భర్త ముక్కుపై బలంగా కొట్టింది. ఆవేశంలో భార్య కొట్టిన దెబ్బలతో గిలగిలలాడిన భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Angry wife punches her husband in the face over birthday party in Dubai, killing him

పుణేలోని వనవాడి ప్రాంతంలోని ఓపోష్ రెసిడెన్షియల్ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిర్మాణ రంగంలో (రియల్ ఎస్టేట్, బిల్డర్) వ్యాపారి అయిన నిఖిల్ ఖన్నా అనే వ్యక్తి అతని భార్య దాడిలో చనిపోయాడని పోలీసులు తెలిపారు. నిఖిల్ ఖన్నా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రేణుకా(38) అనే మహిళను ఆరు ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఈ కేసుకు సంబంధించి పూణేలోని వానవాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నిఖిల్ ఖన్నా భార్య రేణుకా ఆమె పుట్టినరోజు జరుపుకోవడానికి దుబాయ్‌కు తీసుకువెళ్లాలని భర్తకు చెప్పింది. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి రేణుకా ఆమె భర్త నిఖిల్ ఖన్నా మీద ఒత్తిడి చేస్తోందని తెలిసింది.

అయితే భార్య రేణుకాను దుబాయ్ తీసుకెళ్లకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. అలాగే తన బర్త్ డే రోజు, మ్యారేజ్ డే రోజు ఖరీదైన బహుమతులు ఇవ్వలేదని భార్య రేణుకా ఆమె భర్త నిఖిల్ ఖన్నాతో చాలా రోజుల నుంచి గొడవలు పడుతోందని, భార్య తీరుతో నిఖిల్ ఖన్నా చిరాకు పడుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో బధువుల పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఢిల్లీ వెళ్లిన నిఖిల్ ఖన్నా కొన్ని రోజులు అక్కడే ఉన్నాడని తెలిసింది.

Angry wife punches her husband in the face over birthday party in Dubai, killing him

తన బర్తడే వేడుకలు దుబాయ్ లో జరుపుకునే విషయంలో భర్త నిఖిల్ ఖన్నా సరిగా స్పందించకపోవడంతో అతని భార్య రేణుకా మనస్తాపానికి గురైనట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం మద్యాహ్నం ఇదే విషయంలో రేణుకా, నిఖిల్ ఖన్నా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భార్య రేణుకా ఆమె భర్త నిఖిల్ ఖన్నా ముఖంపై పిడిగుద్దులు కురిపించింది.

భార్య రేణుకా కొట్టిన ఆ పంచ్‌ లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి నిఖిల్ ఖన్నా ముక్కు బద్దలు అయ్యింది. నిఖిల్ ఖన్నా మూతిమీద ఉన్న కొన్ని పళ్లు విరిగిపోయాయి. అలాగే, తీవ్ర రక్తస్రావం కారణంగా నిఖిల్ స్పృహ కోల్పోయాడని మహారాష్ట్ర పోలీసులు సమాచారం అందించారు. వెంటనే నిఖిల్ ఖన్నాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై నిఖిల్ ఖన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు తెలిపారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి నిఖిల్ ఖన్నాను హత్య కేసిన అతని భార్య రేణుకా మీద హత్య కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నామని పూణే సిటీ పోలీసు కమీషర్ స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద భార్య బర్త్ డే పార్టీ భర్త చావుకు వచ్చిందని వెలుగు చూడటం పూణేలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+