పార్లమెంటులో కుప్పకూలిన ఎంపీ కన్నుమూత

పార్లమెంటులో కుప్పకూలిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అహమద్ కన్నుమూశారు.

న్యూఢిల్లీ: పార్లమెంటులో కుప్పకూలిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అహమద్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయన పార్లమెంటులోనే కుప్పకూలిపోయారు.

దీంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం తెల్లవారుజామున (గం.2.15 నిమిషాలకు) తుదిశ్వాస విడిచారు.

e ahamed

రాష్ట్రపతి ప్రసంగం సమయంలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వెనక వరుసలోని సీట్లో కూర్చున్న అహమద్ స్పృహ తప్పిపడిపోయారు. రాష్ట్రపతి వైద్య బృందంలోని వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు.

మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయ మంత్రిగా అహమద్ పని చేశారు. ప్రస్తుతం కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోకసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+