వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మాజీ మంత్రి రాజా ప్రచారంపై రెండు రోజులపాటు నిషేధం .. డీఎంకే నేతకు ఎన్నికల కమీషన్ షాక్

|
Google Oneindia TeluguNews

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు భారత ఎన్నికల సంఘం గురువారం ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నాయకుడు ఎ రాజాపై చర్యలకు ఉపక్రమించింది . డిఎంకె నాయకుడు ఎ రాజాను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించింది. 48 గంటలు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది . రాజా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను ఉల్లంఘించారని, రాబోయే 48 గంటలు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

తమిళనాడు ఎన్నికల పోరు .. ప్రచారంలో పక్కనే ఉన్న సొంత పార్టీ నేతపై నిప్పులు చెరిగిన ఖుష్బూ సుందర్తమిళనాడు ఎన్నికల పోరు .. ప్రచారంలో పక్కనే ఉన్న సొంత పార్టీ నేతపై నిప్పులు చెరిగిన ఖుష్బూ సుందర్

డీఎంకె యొక్క

డీఎంకె యొక్క "స్టార్ ప్రచారకుల" జాబితా నుండి రాజా పేరు తొలగింపు

డీఎంకే నాయకుడు ఏ రాజా ఇప్పుడు డీఎంకె యొక్క "స్టార్ ప్రచారకుల" జాబితా నుండి కూడా తొలగించబడ్డాడు. శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి కె. పళనిస్వామి తల్లిపై రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ఎన్నికల ప్రచారంలో సీఎం పళనిస్వామి ఆయన తల్లిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం ఆరు గంటల లోగా దీనిపై సమాధానమివ్వాలని రాజాకు షో-కాజ్ నోటీసు ఇచ్చింది.

 సీఎం పళనిస్వామి తల్లిపై రాజా అనుచితవ్యాఖ్యలు .. షోకాజ్ నోటీసు ఇచ్చిన ఈసీ

సీఎం పళనిస్వామి తల్లిపై రాజా అనుచితవ్యాఖ్యలు .. షోకాజ్ నోటీసు ఇచ్చిన ఈసీ

రాజా యొక్క జవాబును కోరుతూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ మీరు చేసిన ప్రసంగంలోని విషయాలు అవమానకరమైనవి మాత్రమే కాదు, మహిళల మాతృత్వం యొక్క గౌరవాన్ని తగ్గించేలా చాలా అశ్లీలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అనిపిస్తుంది. మార్చి 31 సాయంత్రం 6 గంటలకు లేదా అంతకు ముందు ఈ విషయంలో మీ సమాధానాన్ని వివరించడానికి కమిషన్ మీకు అవకాశం ఇచ్చింది, విఫలమైతే కమిషన్ మీపై చర్యలకు ఉపక్రమిస్తుందని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

 షోకాజ్ కు సమాధానం పంపిన రాజా .. ఆయన వివరణపై ఈసీ అసహనం

షోకాజ్ కు సమాధానం పంపిన రాజా .. ఆయన వివరణపై ఈసీ అసహనం

ఇక ఎన్నికల కమిషన్ పై స్పందిస్తూ, రాజా తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని తప్పుగా ఆరోపించారు. మాజీ కేంద్ర టెలికం మంత్రి తాను "అశ్లీలమైన భాషలో ఏమీ మాట్లాడలేదని , మహిళల గౌరవాన్ని మరియు మాతృత్వాన్ని తగ్గించేలా తాను మాట్లాడలేదని అన్నారు. రాజా తన ప్రసంగం మోడల్ ప్రవర్తనా నియమావళిని లేదా ఇతర చట్టాలను ఉల్లంఘించలేదని ఈసీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

కానీ రాజా యొక్క "మధ్యంతర వివరణ" సంతృప్తికరంగా లేని కారణంగా ఎన్నికల కమిషన్ కేంద్ర మాజీ మంత్రి రాజా పై చర్యలు తీసుకుంది.

చర్యలు తీసుకున్న ఈసీ .. రాజా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

చర్యలు తీసుకున్న ఈసీ .. రాజా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

ఇది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాజకీయ నాయకులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లుగా అయింది . సీఎం పళనిస్వామి ఎఐఎడిఎంకెతో కలిసి తమిళనాడు ఎన్నికల్లో పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు సైతం డిఎంకె నాయకుడు రాజా వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజా వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణులను అవమానించారని బిజెపి తెలిపింది.

రెండు రోజుల పాటు రాజా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధింపు

రెండు రోజుల పాటు రాజా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధింపు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయంపై డిఎంకె నేత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి మహిళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తేలిందన్నారు . డిఎంకె నాయకుడు రాజా చేసిన ఎన్నికల ప్రసంగాన్ని తాను చూశానని, మరణించిన పళని స్వామి తల్లిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అమిత్ షా సైతం మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసుకు రాజా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేని కారణంగా రెండు రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం పై నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది.

English summary
The Election Commission of India (ECI) on Thursday pulled up Dravida Munnetra Kazhagam (DMK) leader A Raja for derogatory comments against Tamil Nadu chief minister Edappadi Palaniswami. The commission said that Raja violated the provisions of the model code of conduct and barred him from campaigning for the next 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X