వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీఎం యడ్యూరప్ప మీద 7 ఎఫ్ఐఆర్‌లు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప మీద లోకాయుక్త అధికారులు మళ్లీ నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. అధికార దుర్వినియోగం చేశారని మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని జేపీ నగర, బిళేకహళ్ళి, బాణసవాడి, హెచ్ బీఆర్ లేఔట్, మహాలక్ష్మి లేఔట్, బనశంకరి తదితర ప్రాంతాలలోని భూములను అక్రమంగా డీ నోటిఫికేషన్ చేశారని సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

Four more FIRs filed against Karnataka ex-CM B S Yeddyurappa

విచారణ చేసిన లోకాయుక్త జేపీ నగర, బిళేకహళ్ళి ప్రాంతాలను అక్రమంగా డీ నోటిఫికేషన్ చేశారని గుర్తించి మూడు ఎఫ్ఐ ఆర్ లు నమోదు చేశారు. మిగిలిన ప్రాంతాలలో విచారణ చేసిన లోకాయుక్త అధికారులు మళ్లి నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

ఇప్పటికే అన్ని కేసుల్లోనూ దర్యాప్తు జరుగుతున్నది. 2009 నుండి 2012 వరకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో అక్రమంగా భూములను డీ నోటిఫికేషన్ చేశారని యడ్యూరప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో మాజీ ఎంపీ జీఎస్. బసవరాజ్, మాజీ శాసన సభ్యుడు నందీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

English summary
With the fresh cases, the total number of FIRs registered against Yeddyurappa for alleged illegal land denotifications has risen to seven, a Lokayukta official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X