విశాఖపట్నం, విజయనగరం ప్రజలకు ముఖ్య గమనిక

రాయగడ-విజయనగరం రైల్వేస్టేషన్ల మధ్య భద్రత ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లు రద్దు చేశారు. ఈనెల 26న విశాఖ-రాయగడ-పాసింజర్, 27న రాయగడ-విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ - విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

అక్టోబరు 26న విశాఖ-రాయగడ ప్యాసింజర్
అక్టబోరు 27న రాయగడ-విశాఖ ప్యాసింజర్
అక్టోబరు 27న విశాఖ-కోరాపుట్ - విశాఖ ప్యాసింజర్
అక్టోబరు 27న విశాఖ-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్

four trains cancelled in visakhapatnam divison

ఈ రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి వేరే రైళ్లల్లో ప్రయాణించే అవకాశం కలుగుతోంది. దీనికి సంబంధించి రైల్వే అధికారులను కలవవచ్చు. అలాగే IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు రైల్వేతో సహకరించాలని అధికారులు కోరారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా ఢిల్లీ-మీరట్ మధ్య ర్యాపిడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. 2025కల్లా ఈ మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వందే భారత్ రైళ్లు గంటకు 130కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 80 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలోనే నడుస్తోంది. దేశవ్యాప్తంగా 34 మార్గాల్లో వందే భారత్ రైళ్లు 68 ట్రిప్పులు వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే సికింద్రాబాద్-పుణె మార్గంలోకూడా ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+