Free Liquor: మగాళ్లకు వారానికి రెండు మద్యం బాటిళ్లను ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే ప్రతిపాదన
Free Liquor: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదనను తీసుకొచ్చారు. పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీలో డిమాండ్ చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. కానీ దీని కోసం ప్రభుత్వం మళ్లీ పన్నులు పెంచాల్సి ఉంటుందని.. దీని కోసం తాను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నానని.. వాటికి అభ్యంతరం చెప్పకండి అంటూ జేడీఎస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మద్యం మీద వచ్చే ఆదాయంతో మహిళలకు నెలకు రూ.2000, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారని ఎంటీ కృష్ణప్ప వెల్లడించారు. కాబట్టి మద్యం తాగేవారికి ప్రతివారం రెండు మద్యం బాటిళ్లను ఉచితంగా ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా సూచించారు. వాళ్లను తాగనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. కనీసం ప్రభుత్వం పురుషుల కోసం కూడా ఏదైనా చేయాలి అంటూ పేర్కొన్నారు.

ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిని వ్యతిరేకిస్తూ మంత్రి కేజే జార్జ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాు. మీరు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దీనిని అమలు చేయాలని అన్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగేలా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. మంత్రి ప్రకటనను స్పీకర సమర్థించారు. రెండు సీసాలు ఇవ్వకుండా ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అదే రెండు మద్యం సీసాలు ఉచితంగా ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చన్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ అన్నారు. కేంద్రమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని సూచించారు. జేడీఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదనపై మహిళా శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
#WATCH | Bengaluru, Karnataka: In the state assembly yesterday, JD(S) MLA MT Krishnappa said, "You (state government) are giving women Rs 2,000 per month, free electricity and free bus travel. Anyway, it is our money. So, those who drink should be given two bottles of liquor free… pic.twitter.com/sahRddxZ1C
— ANI (@ANI) March 19, 2025
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications