Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మణిపూర్‌లో ఆగని హింసాత్మక ఘటనలు: ర్యాపిడ్ దళాలతో ఘర్షణ, గిడ్డంగికి నిప్పు

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. ఆందోళనకారులు, ఉగ్రవాదులు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల కార్యాలయాలను కూడా వారు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, మరోసారి ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇంఫాల్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గిడ్డంగిని తగలబెట్టారు.

ఆ తర్వాత మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో అల్లరిమూకలు ఘర్షణకు దిగాయి.
అల్లరిమూకలు ఇతర ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటుందని భావించిన పోలీసులు వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్స్ సమీపంలో అల్లర్లు సంభవించాయని అధికారులు తెలిపారు.

 Fresh clashes between Manipur’s Rapid Action Force and riotous mob in Imphal; a warehouse torched

అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని గోదాంలోని మంటలను అదుపులోకి తెచ్చి ఇరుగుపొరుగు ఇళ్లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఆస్తి(గిడ్డంగి) గిరిజన వర్గానికి చెందిన రిటైర్డ్ ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారికి చెందినది.

అంతకుముందు గురువారం రాత్రి ఇంఫాల్ పట్టణంలోని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రంజన్ సింగ్ ఇంటిని ఒక గుంపు ధ్వంసం చేసి, దాన్ని కూడా తగలబెట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

ఈ పరిణామం గురువారం మధ్యాహ్నం ఇంఫాల్ పట్టణం నడిబొడ్డున మణిపూర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు రెండు ఇళ్లు దగ్ధం చేశారు. గురువారం ఆలస్యంగా పట్టణంలో సంచరించిన అల్లరిమూకలు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ పరిణామాలపై స్పందించారు మంత్రి రంజన్ సింగ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మే 3 నుంచి (రాష్ట్రంలో జాతి ఘర్షణలు ప్రారంభమైన సమయంలో) శాంతిని నెలకొల్పడానికి, హింసను అరికట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను ... ఇదంతా రెండు వర్గాల మధ్య అపార్థంతోనే జరుగుతోంది. ప్రభుత్వం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది, ప్రక్రియ కొనసాగుతోంది. పౌర సమాజ నాయకులు కలిసి పనిచేస్తున్నారు అని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+