Friends: బార్ లో లిక్కర్ పార్టీ, పాన్ పరాగ్ కోసం గొడవ, నడిరోడ్డులో ఫ్రెండ్ ను చంపిన రౌడీషీటర్ !
బెంగళూరు/హుబ్బళి: ఇద్దరు యువకులు ప్రతిరోజు బార్ లో మద్యం సేవించి ఎంజాయ్ చేసి ఇంటికి వెలుతున్నారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకడు రౌడీషీటర్, ఎప్పటిలాగే రాత్రి బార్ లో మద్యం సేవించి బయటకు వచ్చారు. తరువాత పాన్ పరాగ్, పాన్ మసాలా తీసుకునే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగింది. పాన్ పరాగ్ తీసివ్వలేదని కోపంతో రౌడీషీటర్ అతని స్నేహితుడిని నడిరోడ్డులో పొడిచి చంపేశాడు.
కర్ణాటకలోని హుబ్బళి నగరంలోని ఆనంద్ నగర్ లో మొహబూబ్ రఫీక్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. టైల్స్ ఫిట్టింగ్ పని చేస్తున్న మొహబూబ్ కు గౌస్ మోయిద్దీన్ (30) అనే స్నేహితుడు ఉన్నాడు. గౌస్ హుబ్బళిలో రౌడీషీటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు, గౌస్ మీద అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

మొహబూబ్, గౌస్ లు ప్రతిరోజు రాత్రి బార్ లో మద్యం సేవించి ఎంజాయ్ చేసి ఇంటికి వెలుతున్నారు. రౌడీషీటర్ గౌస్ ఎప్పటిలాగే అతని స్నేహితుడు మొహబూబ్ తో కలిసి రాత్రి మంజునాథ్ నగర్ సమీపంలోని బార్ లో మద్యం సేవించారు. పీకలదాక మద్యం సేవించిన ఇద్దరూ తరువాత బార్ లో నుంచి బయటకు వచ్చారు.
ఆ సమయంలో గౌస్ తనకు విమల్ పాన్ పరాగ్ కావాలని అతని స్నేహితుడు మొహబూబ్ కు చెప్పాడు. డబ్బులు మొత్తం మద్యం సేవించడానికి ఖర్చు అయిపోయిందని, తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. నడుచుకుంటూ ఆనంద్ నగర్ సర్కిల్ వరకు వెళ్లారు.
Aunty : ప్రియురాలి మోజులో అంకుల్, కొడుకుతో కలిసి ఆంటీని చంపేసి ?, కూతురి దెబ్బతో సీన్ రివర్స్ !
సర్కిల్ లో తనకు పాన్ పరాగ్ కావాలని గౌస్ అడిగాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ మొహబూబ్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రౌడీషీటర్ గౌస్ కత్తి తీసుకుని అతని స్నేహితుడు మొహబూబ్ ను నడిరోడ్డు దారుణంగా పొడిచి చంపేసి ఎస్కేప్ అయ్యాడు. పాన్ పరాగ్ కోసం ఫ్రెండ్ ను రౌడీషీటర్ గౌస్ హత్య చెయ్యడం హుబ్బళిలో కలకలం రేపింది.