ప్రజల ఆరోగ్యంపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, 'మోడీ కేర్' పొందాలంటే ఎలా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారత ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలను చేపట్టింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ద్వారా దేశంలోని ఎక్కువ మంది ప్రజలను హెల్త్ ఇన్సురెన్స్ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీం కానుంది.
అదే మోడీ కేర్. ఈ హెల్త్ ఇన్సురెన్స్ పథకం ద్వారా భారతదేశంలోని దాదాపు 40 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సురెన్స్ ఉండనుంది. సామాజిక, ఆర్థిక గణన ఆధారంగా దీంతో 10 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

అంతేకాదు, మోడీ ప్రభుత్వం వ్యాధి నిరోదక శక్తి పైన విస్తృత ప్రచారం చేస్తోంది. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 528 జిల్లాల్లో 3.15 కోట్లకు పైగా చిన్నారులకు, 80 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు ఇచ్చారు.
మోడీ ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించింది. ఇది జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం. సమాజంలోని అన్ని వర్గాలకు ఆరోగ్య సంరక్షణ చేరాలనేదే ఆయుష్మాన్ భారత్ ప్రయత్నం. తద్వారా దాదాపు 50 కోట్ల మందికి ఈ పరిధిలోకి రానున్నారు.
మోడీ కేర్
- ఈ ఆరోగ్య పథకం కిందకు రావడానికి కుటుంబం పరిమితి, వయస్సు, మహిళలు, పురుషులు అనే నిబంధనలు ఏవీ లేవు. కుటుంబంలోని అందరికీ వర్తిస్తుంది.
- ఎస్ఈసీసీ డాటా బేస్ ప్రకారం అర్హులైన అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ ఆరోగ్య పథకం కిందకు వచ్చేవారు ఆసుపత్రిలో డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
- ఆసుపత్రిలో జాయిన్ కావడానికి ముందు నుంచి ఆ తర్వాత కూడా ఈ హెల్త్ స్కీమ్ కవర్ అవుతుంది.
- మీరు దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా లేదా ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లినా ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.
- ఆసుపత్రిలో ఉచిత చికిత్స కోసం ఇందుకు సంబంధించిన ఐడీ కార్డును తీసుకు వెళ్లవలసి ఉంటుంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications