ఆల్‌టైం రికార్డ్: తొలిసారి లీటర్ పెట్రోల్ ధర రూ.86.56, డీజిల్ ధరలు కూడా పైపైకి!

Recommended Video

    తొలిసారి లీటర్ పెట్రోల్ ధర రూ.86.56

    న్యూఢిల్లీ: ఇంధన ధరలు మరోసారి రికార్డు స్తాయిలో పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న అధిక ఎక్సైజ్ సుంకం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

    ఫలితంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. సోమవారం నాటి రోజువారీ సవరణల ప్రకారం.. ముంబైలో రూ.86.56గా ఉంది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ ధర ఇంత అధిక ధర పలకలేదు.

    Fuel prices hit all-time high, petrol Rs 86.56 per litre in Mumbai

    ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర తొలిసారిగా 79 మార్క్‌ను దాటింది.
    ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 31పైసలు పెరిగి రూ.79.15గా ఉంది. ఇక కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.06, చెన్నైలో రూ. 82.24గా ఉంది.

    డీజిల్ ధర కూడా మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 39పైసలు పెరిగి రూ. 71.15గా ఉండగా, ముంబైలో రూ.75.54, చెన్నైలో 75.19, కోల్‌కతాలో రూ.74గా ఉంది. కాగా, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+