• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీకల దాకా తాగి పెళ్లి పీటల మీదికొచ్చిన వరుడు... పెళ్ళికి నిరాకరించిన వధువు

|

గంపెడు ఆశలతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, తప్పతాగి పీటల మీదకి వచ్చిన వారిని చూసి షాక్ కు గురైంది. పెళ్లి పీటల మీద ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్న వరుడిని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంది. పీటల మీద నుండి లేచి వెళ్ళిపోయింది. బంధువులందరూ బతిమిలాడినా ఆ తాగుబోతు ని పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పింది.

లోక్ సభ ఎన్నికలపై శరద్ పవార్ కీలక నిర్ణయం! ఇప్పటికే ఇద్దరు ఉన్నారంటున్న సీనియర్ నేత

మరికొద్ది సేపట్లో పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాల్సి ఉన్న ఆ పెళ్ళికొడుకు తప్పతాగి పెళ్లి మంటపానికి తూలుతూ వచ్చాడు. పెళ్లి పీటల మీద జరిగే పెళ్ళి తంతులో సైతంతను ఏం చేస్తున్నాడు అనేది తెలియకుండా ప్రవర్తించాడు. దీంతో ఆ తాగుబోతు సచ్చినోడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది వధువు. ఎందరు బతిమిలాడినా ససేమిరా అంది. వరుడి తరఫు బంధువులు గొడవకు దిగగా.. వధువు తల్లిదండ్రులు గట్టిగా బదులిచ్చారు.పెళ్లి రోజే తాగొచ్చిన ప్రబుద్ధుడికి తమ పిల్లను ఎలా ఇవ్వమంటారని ప్రశ్నించారు. దీంతో చేసేదేం లేక ఆ తాగుబోతు యువకుణ్ని పెళ్లి మంటపం నుంచి తమ వెంట తీసుకెళ్లారు బంధువులు. పెళ్లి వేడుకల కోసం తీసుకొచ్చిన వస్తువులను యథావిధిగా ప్యాక్ చేసుకొని వెళ్లిపోయారు. మద్యపాన నిషేధ రాష్ట్రం బిహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వధువు ధైర్యాన్ని అందరూ మెచ్చుకునేలా చేసింది. వివాహం ఆగిపోయింది అని బాధ పడకుండా సరైన నిర్ణయం తీసుకుందని వధువు తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.

Fully drunk groom came for marry .. Bride refuses to marry drunk groom

బీహార్‌లోని ఛాప్రా పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన లో పెళ్లి రోజే వరుడు కంట్రోల్లో లేనంతగా తాగడమే కాకుండా.. వివాహ వేదిక వద్ద హంగామా చేశాడు. ఆ యువకుడు తనకు పెళ్లి జరుగుతోందన్న విషయం కూడా మరిచిపోయి సోయి లేకుండా తాగేసి వచ్చాడు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో అతడున్నాడు. అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి? అని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వధువు తీసుకున్న నిర్ణయానికి పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మొత్తానికి తాగుబోతు వరుడిని పెళ్లికి నిరాకరించి వధువు సరైన సమాధానం చెప్పింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A bride in Dumri Chapra village here called-off her weddinng after the groom allegedly turned up in an inebriated state for the marriage.the groom was unable to stand properly as he was heavily drunk Also, he could not perform the rituals correctly, as a result, she left the wedding and went away.Both the families tried to convince Kumari for the marriage but she did not agree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more