ముగిసిన జీ20 సదస్సు-ఆఫ్రికా చేరికతో జీ21గా మార్పు-బ్రెజిల్ కు అప్పగించిన మోడీ...
ఢిల్లీ వేదికగా నిన్నటి నుంచి జరుగుతున్న రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఇవాళ రెండోరోజు ఉదయం వన్ ఫ్యూచర్ అంశంపై చర్చించిన వివిధ దేశాధినేతలు, న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోద ముద్ర తెలిపిన తర్వాత సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ఢిల్లీ సదస్సులో జీ20లో సభ్యదేశంగా ఆఫ్రికా యూనియన్ చేరిన తర్వాత దీన్ని జీ21గా మార్చారు. అలాగే వచ్చే ఏడాది వరకూ జీ21 అధ్యక్ష బాధ్యతల్ని భారత్ లాంఛనంగా బ్రెజిల్ కు అప్పగించింది.
జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చుకోవడం అనేది మరింత సమగ్రమైన ప్రపంచ చర్చల దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రధాని మోడీ తెలిపారు. మొత్తం ప్రపంచ ప్రయోజనాల కోసం సహకార ప్రయత్నాలను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు చూసిన ఈ ఏడాది కాలంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా ఆఫ్రికన్ యూనియన్ చేరిక నిలిచిపోతుందన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహంలో కొత్త శాశ్వత సభ్యునిగా మారిందని మోడీ తెలిపారు. ఇది 1999లో ప్రారంభమైనప్పటి నుండి ప్రభావవంతమైన కూటమి యొక్క మొదటి విస్తరణ మాత్రమే.

అడిస్ అబాబా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆఫ్రికన్ యూనియన్ (AU) ఆఫ్రికన్ ఖండంలోని దేశాలను రూపొందించే 55 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇది అధికారికంగా 2002లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీకి వారసత్వంగా ప్రారంభించారు. ఇది 32 మంది సభ్యులతో 1963లో స్థాపించబడింది. స్వాతంత్ర్యం తర్వాత ఆవిర్భవించిన ఆఫ్రికా మొదటి ఖండాంతర సంస్థ కూడా. సమిష్టిగా ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలు దాదాపు 3 ట్రిలియన్ల యూఎస్ డాలర్ల జీడీపీ, సుమారు 1.4 బిలియన్ల జనాభాను కలిగి ఉన్నాయి.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంతో ఈ శిఖరాగ్ర సమావేశం అధికారికంగా ముగిసింది. ఈ సందర్భంగా జీ20 బ్యాటన్ ను ఆయన బ్రెజిల్ ప్రధానికి అందించారు. మొత్తం ప్రపంచంలో ఆశ, శాంతి కోసం ప్రార్థించడానికి సంస్కృత ప్రార్థనలను కూడా ప్రధాని మోదీ ఉదహరించారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య విడిగా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications