నాలుగు గోడల మధ్యే: 'శ్రీరాములు-గాలి మధ్య రాజీ కుదుర్చుతా'
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే సమస్యను వీధిలోకి తేవడం సరికాదని, ఇంటి స్థలాల విక్రయం అంశంపై తన సోదరుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీ శ్రీరాములుకి మధ్య రాజీ కుదుర్చుతానని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి అన
బళ్లారి: నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే సమస్యను వీధిలోకి తేవడం సరికాదని, ఇంటి స్థలాల విక్రయం అంశంపై తన సోదరుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీ శ్రీరాములుకి మధ్య రాజీ కుదుర్చుతానని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి అన్నారు.
ఎంపీ బి శ్రీరాములు తమకు సోదరుడితో సమానమన్నారు. తమ కుటుంబ శ్రేయస్సుకు శ్రీరాములు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
కాగా, గతంలో తమ సోదరుడు కరుణాకర రెడ్డి పేరిట 2.7 ఎకరాలు, ఎంపీ శ్రీరాములు పేరు మీద 8.75 ఎకరాల స్థలాన్ని సంయుక్తంగా కొనుగోలు చేశారు. దానిని అభివృద్ధి చేసి సుష్మా స్వరాజ్ కాలనీగా ఏర్పాటు చేశారు.

ఇందులో శ్రీరాములు ఎనిమిది ఇళ్లస్థలాలను విక్రయించారు. ఈ విషయంలోనే వివాదం తలెత్తిందని సోమశేఖర రెడ్డి చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇరు వర్గాలు పరస్పరం పెట్టుకున్న కేసులు ఉపసంహరింప చేస్తామన్నారు.
తమ సోదరుడు కరుణాకర రెడ్డి కొంతకాలంగా తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న విషయం వాస్తవమేనన్నారు. గనుల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నపుడు కరుణాక రెడ్డి ఒకసారి వెళ్లి పలకరించి వచ్చారు. అనంతరం ఓసారి సీబీఐ అధికారులు తనతో పాటు తన సోదరుడు కరుణాకరరెడ్డిని విచారించారన్నారు.
అప్పటి నుంచి ఆయన తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా అంతా కలిసి ఉండేలా కృషి చేస్తానన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications