ఆర్ టీసీ సిబ్బందికి గుడ్ న్యూస్, గాంధీ పాయింట్ క్యాంటీన్లు ప్రారంబించిన రెడ్డి, సిటీ మొత్తం!

బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిన తరువాత కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరా క్యాంటిన్లకు పూర్వవైభవం తీసుకోస్తోంది. అలాగే రవాణా సిబ్బందికి (KSRTC) నాణ్యమైన స్నాక్స్‌, టిఫిన్లు భోజనం అందించే క్యాంటీన్‌ను ప్రారంభించి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి (CM) సిద్ధరామయ్య మాట్లాడుతూ కేఎస్ఆర్ టీసీ (RTC), బీఎంటీసీ డిపోల్లో అక్కడి సిబ్బంది నాణ్యమైన ఆహారం అందించడానికి ప్రత్యేకంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈరోజు బెంగుళూరులోని బీఎంటీసీ (BMTC) నాలుగో యూనిట్‌లో నాణ్యమైన, రాయితీపై టిఫిన్లున, భోజనం మరియు స్నాక్స్ అందించే గాంధీ పాయింట్ క్యాంటీన్ లను ప్రారంభించారు.

Gandhi Point canteens for BMTC staff in Bengaluru, inaugurated by Minister Ramalinga Reddy

సీఎం (CM) సిద్దరామయ్య చెప్పినట్లు అన్ని పనులు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. మహాత్మా గాంధీ జయంతిని ఈరోజు (అక్టోబర్ 02వ తేదీన) బీఎంటీసీ ( BMTC) యూనిట్ 4లో చాలా సాదాసీదాగా గాంధీ పాయింట్ క్యాంటిన్ ను ప్రారంభించి గాంధీ జయంతిని జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బీఎంటీసీ (BMTC) సిబ్బందికి రాయితీ ధరలకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించేందుకు గాంధీ పాయింట్‌ క్యాంటిన్ ఏర్పాటు చేశామని కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి (Reddy)అన్నారు. గాంధీ పాయింట్ క్యాంటిన్ ను మంత్రి రామలింగా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామలింగా రెడ్డి (Reddy)మాట్లాడుతూ మెజెస్టిక్ లోని బీఎంటీసీ బస్ స్టేషన్‌లో ఇప్పటికే క్యాంటీన్‌ను ప్రారంభించే పనులు కొనసాగుతున్నాయని అన్నారు.

Gandhi Point canteens for BMTC staff in Bengaluru, inaugurated by Minister Ramalinga Reddy

బెంగళూరు (Bengaluru) నగరం మధ్య భాగంలోని బస్టాండ్‌లో క్యాంటీన్‌ను ప్రారంభించడం వల్ల నాలుగు రవాణా సంస్థల డ్రైవర్లకు, సిబ్బందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన మంత్రి రామలింగా రెడ్డి (Reddy) చెప్పారు. నాణ్యమైన ఆహారం తగ్గింపు ధరలకు లభిస్తుందని, మిగతా యూనిట్లలో కూడా గాంధీ పాయింట్ క్యాంటీన్లు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా బీఎంటీసీ సౌత్ డివిజన్ డివిజనల్ కంట్రోలర్ కీర్తిచంద్ర, జయనగర్ (Jayanagar) యూనిట్ 4వ యూనిట్ మేనేజర్ రవీంద్ర, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+