వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ నిర్బయ గ్యాంగ్ రేప్ కు ముందే రాబరి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ పారమెడికల్ విద్యార్థిని నిర్బయ (23) గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన నిందితులు మరో కేసులో దోషులుగా గుర్తించారు. గ్యాంగ్ రేప్ జరగక ముందే నిందితులు దంపతులను బెదిరించి రాబరి చేశారని కోర్టు విచారణలో వెలుగు చూసింది.

2012 డిసెంబర్ 16వ తేదిన రాత్రి పారమెడికల్ విద్యార్థిని నిర్బయ (23), ఆమె స్నేహితుడిని వేగంగా వెలుతున్న బస్సులో దాడి చేశారు. తరువాత యువతి మీద కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం యువతి సున్నితమైన భాగాలలో ఇనుప రాడ్ కుచ్చారు.

తరువాత ఇద్దరిని నగ్నంగా తయారు చేసి బస్సులో నుండి రోడ్డు పక్కన నెట్టేసి పరారైనారు. ఈ కేసులో పోలీసులు ఒక మైనర్ తోపాటు అక్షయ్ కుమార్ సింగ్, ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, రామ్ సింగ్ అనే కామాంధులను అరెస్టు చేశారు. నిందితులు నేరం చేసినట్లు రుజువుకావడంతో ఉరి శిక్ష విదించారు.

Gang-Rape Convicts Now Convicted in Robbery Case in New Delhi

అయితే గ్యాంగ్ రేప్ జరగక ముందు నిందితులు అందరూ కార్పెంటర్ గా పని చేస్తున్న రామ్ ఆధర్, ఆయన భార్యను బెదిరించి మొబైల్ ఫోన్ లు, రూ. 1,500 లాక్కోని పరారైనారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కేసు విచారించిన ఢిల్లీ న్యాయస్థానం నిందితులు నేరం చేసినట్లు రుజువు అయ్యిందని, వారిని దోషులుగా గుర్తించామని తీర్పు చెప్పింది. నిర్బయ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన రామ్ సింగ్ 2013 మార్చి నెలలో తీహార్ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాంగ్ రేప్ కేసులో ఓ నిందితుడు మైనర్.

English summary
Akshay Kumar Singh, Mukesh, Pawan Gupta and Vinay Sharma -- had robbed a carpenter, Ram Adhar (35), a couple of hours before they sexually assaulted the 23-year-old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X