కిరాకతకం: టెక్కీ కూతురిపై స్కూల్లో గ్యాంగ్ రేప్

బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఓ పాఠశాలలో అత్యంత దారుణమైన, కిరాతకమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పాఠశాల ఉద్యోగులే ఒకటో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కుందలహళ్లి సమీపంలోని వర్థూర్ - హరలూర్ రోడ్డుపై గల విబ్జియార్ స్కుల్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు ఒడిషాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూతురు. అమ్మాయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తరగతుల్లో క్లాసులు జరుగుతుండగా అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో అనుమానితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Gang rape of minor: Cops question 2 suspects, hold identification parade

ఈ జిమ్ ఇన్‌స్ట్రక్టర్, సెక్యూరిటీ గార్డును విచారిస్తున్నట్లు వారు తెలిపారు. రెండోసారి గుర్తింపు పరేడ్ జరిపి నిందితులను గుర్తిస్తామని వారు చెప్పారు. స్కూల్లో 27 మంది జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారని, దాంట్లో నిందితులను గుర్తించడం చాలా కష్టంగా ఉందని డిసిపి టిడి పవార్ చెప్పారు.

బాలిక తీవ్ర భయాందోళనలకు గురైందని ఆయన అన్నారు. బాలిక వాంగ్మూలం రికార్డు చేస్తామని ఆయన చెప్పారు. అనుమానితులు చెప్పిన విషయాలను బాలిక వాంగ్మూలంతో పోల్చి చూస్తామని అన్నారు. బాలికను తాము ఇబ్బంది పెట్టదలుచుకోలేదని, దీంతో దర్యాప్తు నెమ్మదిగా జరుగుతోందని అన్నారు. సున్నితంగా ఈ కేసును పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+