ట్విస్ట్:విచారణ సాగుతుండగానే గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి, ఎంఏల్ఏ పై ఆరోపణలు

గ్యాంగ్ రేప్ బాధితురాలు కేసు విచారణలోనే ఉండగానే అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. ఈ కేసులో సమాజ్ వాదీ పార్టీ ఎంఏల్ఏ అరుణ్ వర్మ కూడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తానాపూర్ కు చెందిన 21 ఏళ్ళ యువతి గ్యాంగ్ రేప్ కు గురైన మూడేళ్ళు దాటుతోంది.అయితే నిందితులపై ఇంకా చర్యలు తీసుకోలేదు.అయితే నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంఏల్ఏల అరుణ్ వర్మ కూడ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.అయితే బాధితురాలు చనిపోవడం కలకలం రేపుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తానాపూర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ళ యువతిపై 2013 లో ఎనిమిది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంఏల్ఏ అరుణ్ వర్మ కూడ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Gang-Rape Survivor Who Named Samajwadi Lawmaker Found Dead In UP

బాధితురాలి తండ్రి కూడ పోలీసులకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశాడు.అయితే పోలీసులు విచారణ జరిపి అరుణ్ వర్మకు క్లీన్ చీట్ ఇచ్చారు.

ఈ విషయమై విపక్షాలు తనపై కుట్ర చేస్తున్నాయని అరుణ్ వర్మ విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు కూడ విచారణల్లో తప్పించుకొంటున్నారు. అయితే శనివారం సాయంత్రం ఇంటి బయటే ఉన్న వాష్ రూమ్ కు వెళ్ళిన బాధితురాలు కన్పించకుండా పోయింది.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఆమె మృతదేహం కన్పించింది. అయితే ఎవరో ఆమెను గొంతు నులిమి చంపిన ఆనవాళ్ళు కన్పించాయని పోలీసులు చెబుతున్నారు.

ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో వీరి కుటుంబానికి పోలీసుల రక్షణ ఉండేది.అయితే ఇటీవలే పోలీసుల రక్షణను ఉపససంహరించారు. కేసు విచారణలో ఉండగానే బాధితురాలు చనిపోవడం కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+