రాయగఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ ... విశాఖ ఘటన మరవకముందే మరో ఘటన

ఏపీలో ఎల్జీ పాలిమర్స్ వద్ద విష వాయువుల లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది . ఇక ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థత పాలైన చాలా మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి 11 మంది మరణించారు . ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ లీకేజ్ ఘటన మరచిపోక ముందే ఛత్తీస్‌ గడ్ రాష్ట్రంలోని రాయగఢ్ పేపర్ మిల్లులో గురువారం గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. కార్మికుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది .

ఇంతకాలం లాక్ డౌన్ తో మూసి ఉన్న మిల్లును తిరిగి ప్రారంభించే క్రమంలో రాయగఢ్ పేపర్ లో మిల్లులోని ట్యాంక్ క్లినింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై, ఏడుగురు కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. దాంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని రాజధాని రాయ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ అయినప్పటి నుండి మూసివేయబడిన మిల్లును త్వరలో తిరిగి తెరవాలని కార్మికులు ట్యాంకులు శుభ్రం చేస్తున్నారు.

Gas leakage at Raigarh paper mill.. 7 workers hospitalised, 3 critical

ఇక ఈ క్రమంలో ఒక్కసారిగా విష వాయువులు లీక్ అయ్యి ఏడుగురు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాయగఢ్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ మరియు కలెక్టర్ యశ్వంత్ కుమార్ గ్యాస్ లీక్‌తో బాధపడుతున్న వారిని పరామర్శించారు . ఈ సంఘటనను దాచడానికి మిల్లు యజమాని ప్రయత్నించాడని, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+