పూరీ జగన్నాథుడి సేవలో అదానీ.. లక్షలాది మంది భక్తులకు అన్నదానం
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. పూరీలో అట్టహాసంగా జరుగుతున్న జగన్నాథుడి రథ యాత్ర సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా కిచెన్ లో కుటుంబంతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వామి వారి సేవలో పాల్గొని లక్షలాది మంది భక్తులకు అన్నదానం చేశారు.
అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాలంటే ముందుండే ఆయన మరోసారి తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఇస్కాన్ గ్రూప్ నిర్వహించిన మెగా కిచెన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అంతేకాక లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదం అందించారు.
కుంభమేళా సమయంలోనూ ఇస్కాన్, అదానీ గ్రూప్ సంయుక్తంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఇక ఈ సేవా కార్యక్రమంలో అదానీ, ఆయన సతీమణి డాక్టర్. ప్రీతి అదానీ, కుమారుడు కరన్ అదానీతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదానీ మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయాలను గౌరవించడంలో తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. తన వ్యక్తిగత సిబ్బంది వారించినా.. పూరీలు చేస్తూ, సబ్జీ కలుపుతూ అక్కడి వాలంటీర్లలో ఉత్తేజాన్ని నింపారు గౌతమ్ అదానీ.

ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. "ఇది ఒక అద్భుతమైన, స్వచ్ఛందమైన సేవ" అని కొనియాడారు. అదానీ కుటుంబం భాగస్వామ్యం ఎంతో స్ఫూర్తిదాయక మన్నారు. అదానీ కుటుంబం నిరాడంబరంగా, విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతుంది అనడానికి ఇదో గొప్ప ఉదాహరణ అని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications