ఆసక్తికరం: కాంగ్రెస్ టిక్కెట్ కావాలా, ఫేస్‌బుక్‌లో 15వేలు, ట్విట్టర్‌లో 5వేలమంది ఉండాలి
భోపాల్: త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టిక్కెట్ కావాలంటే ఫేస్‌బుక్‌లో 15,000 లైక్స్, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్స్ ఉండాలట!
మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి పగ్గాలు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంతోపాటు సోషల్ మీడియాను సాధ్యమైనంత వినియోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా టికెట్ ఆశిస్తున్న నేతలకు సరికొత్త పరీక్ష పెట్టింది.
అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేతలకు సోషల్ మీడియాపై పట్టు ఉంటే సరిపోతుందని, అదే పెద్ద అర్హతని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలిపింది. తమ సొంత ఫేస్‌బుక్ ఖాతాకు 15 వేల లైక్‌లు, ట్విట్టర్‌లో ఐదువేల ఫాలోవర్లు ఉంటే టికెట్ అర్హులేనని తేల్చి చెప్పింది. అలాగే, బూత్ లెవల్‌లోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహించాలని పేర్కొంది. కాంగ్రెస్ కమిటీ చేసే ప్రతీ ట్వీట్‌ను రీట్వీట్ చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications