ఇంట్లోకి పిలిచి రేప్: న్యూడ్‌గా వీడియో తీశాడు, బెదిరించి మళ్లీ మళ్లీ

ఫరీదాబాద్: ఫరిదాబాదులో దారుణం జరిగింది. 18 ఏళ్ల గ్రాడ్యుయేట్ విద్యార్థి పైన ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని వీడియో తీసి ఆమెను బెదిరిస్తున్నాడు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

పాలవ్యాపారి కూతురు అయిన ఆ బాధితురాలు జనవరి 13వ తేదీన ఉదయం వీరేంద్ర అనే వ్యక్తి ఇంటికి పాలు ఇచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో వీరంద్ర ఒక్కటే ఉన్నాడు. ఆమెను తన ఇంటిలోకి పిలిచాడు. ఓ గ్లాస్ వాటర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన నీళ్లు తాగాక ఆమె స్పృహ తప్పిపడిపోయింది.

ఆమెకు తెలివి వచ్చి చూసేసరికి.. తన ఒంటి పైన బట్టలు లేవు. న్యూడ్‌గా ఉంది. వీరేంద్ర ఆమెవైపే చూస్తూ ఉన్నాడు. నిన్ను రేప్ చేశానని, దానిని వీడియో తీశానని చెప్పాడు. ఇప్పుడు జరిగిన విషయం ఎవరికైనా చెబితే తాను ఈ వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు.

Girl accuses man of raping her repeatedly

ఆ వీడియోను ఆసరగా చేసుకొని తనను బ్లాక్ మెయిల్ చేసి తన పైన ఆ తర్వాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. అంతేకాకుండా, తనను డబ్బులు కూడా డిమాండ్ చేశాడని చెప్పింది. తనన చంపేస్తానని కూడా బెదిరించాడని చెప్పింది.

తనకు ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయిందని, అయితే వీరేంద్ర తన వద్ద ఉన్న వీడియోను అతనికి పంపించడంతో అది క్యాన్సిల్ అయిందని చెప్పింది. ఇటీవల బయటకు వచ్చే వరకు ఈ విషయం ఆ బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. అనంతరం తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అత్యాచార బాధితురాలు ఆత్మహత్య

శరణపుర్‌లో ఓ మైనర్ బాలిక పైన పలుమార్లు అత్యాచారం జరిగింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె గ్రామానికి చెందిన యువకుడు రెండు రోజుల క్రితం కూడా ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిన్న తనకు తాను నిప్పు అంటించుకొని మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+