డ్రెస్ మార్చుకుంటుండగా..: వ్యక్తిని పబ్లిక్‌గా చెప్పుతో కొట్టిన యువతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఓ యువతి ధైర్యం ప్రదర్శించారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అందరి ముందు చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన శనివారం నాడు కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో జరిగింది. అతని వయస్సు దాదాపు ముప్పై వరకు ఉంటుంది.

సదరు యువతి డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా.. అతను తన వద్ద ఉన్న ఫోన్ కెమెరాతో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి అతనిని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ సంఘటన ఓ పార్క్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇద్దరు లాయర్లకు షోకాజ్ నోటీసులు
నిర్భయ గ్యాంగ్ రేప్‌పై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీలో మహిళలపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఇద్దరు లాయర్లకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బిబిసి డాక్యుమెంటరీలో చేసిన వ్యాఖ్యలకు గాను మేము న్యాయవాదులు ఎంఎల్ శర్మ, ఎపి సింగ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసామని బిసిఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా చెప్పారు. ట్రయల్ కోర్టులో నిందితుల తరఫున వాదించిన ఈ ఇద్దరు లాయర్లు చేసిన వాఖ్యలు ప్రాథమికంగా అభ్యంతరకరంగాను, న్యాయవాదుల వృత్తిపరంగా తప్పుగాను ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications