యువతి ఫిర్యాదు: మత్తు ఇచ్చి వివాహం చేసుకున్నాడు, ఆపై రేప్ చేశాడు
చెన్నై: తనకు ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఊటికి చెందిన యువతి చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. ఆమె కాలేజీ సమీపంలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది.
కాగా, ఈమెకు, కృష్టగిరిలో జిమ్ నడుపుతున్న కుమార్(27)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ తల్లిదండ్రులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. తర్వాత విడిగా ఇల్లు తీసుకుని జీవించసాగారు. సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు చెన్నైకి వచ్చి ఆమెను కలిశారు. ఆమెకు వేరొక వరుడ్ని చూసి వివాహం చేస్తామని చెప్పి ఆమెను తీసుకెళ్లారు.

దీంతో తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని కుమార్ కృష్ణగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉండగా ఎగ్మూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఆ యువతి కూడా ఫిర్యాదు చేసింది. కుమార్ తనను కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
స్పృహలోకి వచ్చిన తర్వాత తాను తాళిని తెంచేసి అతని దగ్గర్నుంచి తప్పించుకున్నాని తెలిపింది. తన వద్దకు రాకుంటే చంపేస్తానని కుమార్ బెదిరింపులకు గురి చేస్తున్నాడని కూడా ఆ యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న ఎగ్మూరు పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications