15 ఏళ్ల బాలికను ఐదుగురు లాక్కెళ్లి, గ్యాంగ్ రేప్

హౌరా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో దారుణం జరిగింది. పదిహేనేళ్ల బాలిక పైన అయిగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని శుక్రవారం నాడు హౌరా జిల్లాలోని శ్యాంపూర్ పోలీసులు తెలిపారు. బాధిత బాలిక శివరాత్రి ఉత్సవాల కోసమని మంగళవారం తన తల్లితో కలిసి వచ్చింది.

అయితే, తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఆమె తాను వెళ్లే దారిని మరిచిపోయింది. అయితే, ఆ తర్వాత ఆమె తమ ఇళ్లు ఉన్న ప్రాంతానికి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో కనిపించింది. గురువారం నాడు ఆమె కనిపించింది.

Girl gang raped in West Bengal, two held

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తాను ఇంటికి వెళ్తుండగా తన తల్లితో విడిపోయానని, ఆ తర్వాత అయిదుగురు యువకులు తనను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారని చెప్పింది. అక్కడ ఆ బాలిక పైన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.

బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+