బర్త్‌డే పార్టీకి అని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం
ముంబై: పుట్టినరోజుకు పార్టీకి అని చెప్పి తీసుకెళ్లి ఓ బాలికపై ఇద్దరు యవకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం థానేలోని గోడుబందర్ ప్రాంతానికి చెందిన బాలికను ఆమె స్నేహితుడు పుట్టినరోజు పార్టీకి పిలిచాడు.
బాలికను పుట్టినరోజు పార్టీకి తీసుకెళ్లడానికి వచ్చిన కౌస్తుబ్‌చవాన్(21) అనే యువకుడు బాలికను టూ వీలర్‌పై ఎక్కించుకొని పుట్టిన రోజు జరిగే ప్రాంతానికి తీసుకెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం బాలికకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి, స్పృహ కోల్పోయేలా చేశారు.

అనంతరం కౌస్తుబ్ చవాన్, అతని స్నేహితుడు మందార్‌లు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ నుంచి తేరుకున్న బాలిక తనపై అత్యాచారం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను, వాళ్లకు సహరించిన దీపాలి అనే యువతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications