ఒకే ఒక్క సారి, నో చెప్పిన కాలేజ్ యువతి: రేప్ చేసి నిప్పంటించిన ప్రియుడు, చివరికి ?

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: ఇంటిలో ఒంటరిగా ఉన్న కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి చివరికి ఆమెను గదిలో కట్టేసి నిప్పంటించి హత్య చేసిన ఘటన బీహార్ లోని కగారియా జిల్లాలోని థమ్తా కరారీ గ్రామంలో జరిగింది. 21 ఏళ్ల యువతి ప్రియుడి చేతిలోనే అంతం అయ్యింది.

ఇంటిలో ప్రియుడితో రోమాన్స్: యువతి ఫ్యామిలీ చూసింది: కత్తిరించి కాలువలో విసిరేశారు !

కగారియా జిల్లా ఎస్పీ మిను కుమారి కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరారీ గ్రామంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి, అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఒకే కాలేజ్ లో చదువుతున్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని సమాచారం.

ఇంటిలో ఒంటరిగా !

ఇంటిలో ఒంటరిగా !

ఆదివారం యువతి కుటుంబ సభ్యులు బంధువుల ఊరికి వెళ్లారు. ఇంటిలో యువతి ఒంటరిగా ఉంది. తన ప్రియురాలి కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారు అనే విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు అక్కడి వెళ్లాడు. ఇద్దరూ ఇంటిలోనే మాట్లాడుకుంటున్నారు.

ప్రియురాలి మీద కన్ను !

ప్రియురాలి మీద కన్ను !

ఇంటిలో ఒంటరిగా ఉన్న ప్రియురాలి మీద కన్ను వేశాడు. ఎప్పటి నుంచో ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తున్న అతను ఇదే మంచి చాన్స్ అనుకున్నాడు. ఇంటిలో అయితే ఆమె అభ్యంతరం చెప్పదని, ఇదే మంచి అవకాశం అని భావించాడు.

సరసాలు, నో చెప్పిన ప్రియురాలు

సరసాలు, నో చెప్పిన ప్రియురాలు

సరసాలు ఆడటానికి ఆమె నో చెప్పింది. ఒకేఒక్క సారి అంటూ ఆమెను లొంగదీసుకోవడానికి అతను ప్రయత్నించాడు. అయితే ఎంతసేపటికి ఆమె అంగీకరించకపోవడంతో తనలోని కామావాంచ తీర్చుకోవడానికి అతను తెగించాడు. యువతిని బలవంతంగా అనుభవించాలని నిర్ణయించాడు.

రేప్ చేసి నిప్పంటించాడు !

రేప్ చేసి నిప్పంటించాడు !

యువతి లొంగకపోవడంతో ఆమె మీద అత్యాచారం చేశాడు. తరువాత తల్లిదండ్రులు, గ్రామస్తులకు చెబుతానని యువతి హెచ్చరించడంతో అతను తెగించాడు. యువతిని ఆమె గదిలోనే నిర్బంధించి కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. యువతి గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు మంటలు అదుపు చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

 నా ప్రియుడే చేశాడు !

నా ప్రియుడే చేశాడు !

తన మీద అత్యాచారం చేసిన తన ప్రియుడే నిప్పంటించాడని యువతి వాంగ్మూలం ఇచ్చిందని జిల్లా ఎస్పీ మిను కుమారి చెప్పారు. చికిత్స విఫలమై ఆమె మరణించిందని అన్నారు. అత్యాచారం, హత్య చేసిన నిందితుడు తప్పించుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The young man entered the house of the girl and raped her before setting her on fire with kerosene oil at Temtha Karari village, Superintendent of Police Minu Kumari said.
Please Wait while comments are loading...