Shout out: నడిరోడ్డులో గర్ల్ ఫ్రెండ్ ను కాల్చి చంపేసి బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, వైరల్ !

ముంబాయి/పాల్ గార్: యువతి, యువకుడు స్నేహితులు అయ్యారు. చాలాకాలం నుంచి ఇద్దరూ హ్యాపీగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల యువతి, యువకుడి మద్య తేడా వచ్చిందని తెలిసింది. యువతి ఆమె స్నేహితుడికి దూరం అవుతూ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ను దగ్గర చేసుకోవాలని అతను అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నడుచుకుని వెలుతున్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన బాయ్ ఫ్రెండ్ నీతో మాట్లాడాలని చెప్పాడు .ఇద్దరూ మాట్లాడుకుంటున్న సందర్బంలో గొడవ జరిగింది. యువతి నడుచుకుంటూ వస్తుంటే వెనుకనే బాయ్ ఫ్రెండ్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన యువకుడు జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని గర్ల్ ఫ్రెండ్ ను స్పాట్ లో కాల్చి చంపేశాడు. గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేసిన యువకుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన భద్రతా వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

బాగానే ఉన్నారు

బాగానే ఉన్నారు

మహారాష్ట్రలోని పాల్ గార్ జిల్లాలోని బోయ్స్ర్ లో క్రిష్ణ యాదవ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నేహా మెహతో అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి క్రిష్ణ యాదవ్, నేహా మెహతో స్నేహితులు. చాలాకాలం నుంచి క్రిష్ణ యాదవ్, నేహా మెహతో హ్యాపీగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.

దూరం కావాలని గర్ల్ ఫ్రెండ్ డిసైడ్

దూరం కావాలని గర్ల్ ఫ్రెండ్ డిసైడ్

చాలాకాలం నుంచి క్రిష్ణ యాదవ్, నేహా మెహతో సంతోషంగా తిరుగుతుంటే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని వారి స్నేహితులు అనుకున్నారు. అయితే కొంతకాం క్రితం క్రిష్ణ యాదవ్, నేహా మెహతో మద్య తేడాలు వచ్చాయని తెలిసింది. రానురాను నేహా మెహతో ఆమె బాయ్ ఫ్రెండ్ క్రి్ష యాదవ్ కు దూరం అవుతూ వచ్చింది.

రోడ్డు మీద గొడవ

రోడ్డు మీద గొడవ


గర్ల్ ఫ్రెండ్ నేహా మెహతోను దగ్గర చేసుకోవాలని, ఆమెతో కలిసి ఉండాలని బాయ్ ఫ్రెండ్ క్రిష్ణ యాదవ్ ఇటీవల కాలంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. నేహా మెహతో నడుచుకుని వెలుతున్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన బాయ్ ఫ్రెండ్ క్రిష్ణ యాదవ్ నీతో మాట్లాడాలని చెప్పాడు. మాట్లాడుకుంటున్న సందర్బంలో నేహా మెహతో, క్రిష్ణ యాదవ్ మద్య గొడవ జరిగింది.

 గర్ల్ ఫ్రెండ్ ను రివాల్వర్ తో కాల్చి చంపేసి ?

గర్ల్ ఫ్రెండ్ ను రివాల్వర్ తో కాల్చి చంపేసి ?

ఆ సందర్బంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన క్రిష్ణ యాదవ్ జోబులో ఉన్న కంట్రీ మేడ్ రివాల్వర్ తీసుకుని అతని గర్ల్ ఫ్రెండ్ నేహా మెహతో మీద కాల్పులు జరిపాడు. క్రిష్ణయాదవ్ రివాల్వర్ తూటాలకు నేహా మెహతో స్పాట్ లో చనిపోయింది. నేహా మెహతోను కాల్చి చంపేసిన క్రిష్ణ యాదవ్ అటు వైపు వేగంగా వెలుతున్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండష్ట్రియల్ సెక్యూరిటీ సంస్థ వాహనం కిందకు దూకేశాడు.

ఇద్దరి మద్య ఏం జరిగింది ?

ఇద్దరి మద్య ఏం జరిగింది ?

తలకు తీవ్రగాయాలైన క్రిష్ణ యాదవ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే క్రిష్ణ యాదవ్ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. నేహా మెహతోను క్రిష్ణ యాదవ్ ఎందుకు హత్య చేశాడు ?, తరువాత అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

 సీసీటీవీ క్లిప్పింగ్స్ లో ?

సీసీటీవీ క్లిప్పింగ్స్ లో ?

నేహా మెహతాను నడిరోడ్డు మీద కాల్చి చంపడం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వాటిని పోసులు పరిశీలిస్తున్నారు. క్రిష్ణ యాదవ్ అతని గర్ల్ ఫ్రెండ్ నేహా మెహతోను హత్య చెయ్యడానికి ఉపయోగించిన కంట్రీ మేడ్ రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+