సూట్ కేసులో గర్ల్ ఫ్రెండ్.. అక్కడికి తీసువెళ్లాలని అడ్డంగా బుక్కయ్యాడుగా..!
ప్రేమించిన అమ్మాయి కోసం సప్తసాగరాలు దాటే వారిని చూసుంటాం. డబ్బుని లెక్క చేయకుండా కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చేవాళ్ళు.. ఆమె కోసం ప్రాణాలను అయిన లెక్క చేయకుండా ఇచ్చేస్తుంటారు. ప్రేమకు ప్రతీకగా భావించే తాజ్ మహాల్ సైతం ప్రేమ కోసం కట్టిందే. ఈ తరహా లోనే ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్న ఓ విద్యార్థి పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఎవరికీ తెలియకుండా సూట్‌కేసులో కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లడానికి పక్కా ప్లాన్ వేశాడు. కట్ చేస్తే ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ ఎదురవడంతో అతను అడ్డంగా బుక్కయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న జిందాల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్‌కేస్‌తో హస్టల్‌లోకి వచ్చాడు. అందులో ఏమున్నాయని సిబ్బంది అడగగా దుస్తులు, వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నాడు. అతడి తీరుపై అనుమానం వచ్చిన హాస్టల్ గార్డులు సూట్‌కేస్ తెరవాలని కోరగా అందుకు నిరాకరించాడు. దీంతోవారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. సూట్‌కేస్‌ను తెరవగా అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు రావడంతో అవాక్కయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ మధ్య సూట్ కేసులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నట్టున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సూట్‌కేసులో ఉన్న అమ్మాయి అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థా.. లేక బయటనుంచి వచ్చిన వ్యక్తా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.
— Squint Neon (@TheSquind) April 12, 2025
Gets caught.
Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg












Click it and Unblock the Notifications