• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Girlfriend: ప్రియుడి పక్కా స్కెచ్, ప్రియురాలి కిడ్నాప్,ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్,పోయేకాలం పిలిచింది!

|

లక్నో/ ఉత్తర్ ప్రదేశ్/ బారాబంకి: జలాయిగా తిరుగుతున్న యువకుడిని 17 ఏళ్ల బాలిక ప్రేమించింది. సంవత్సరం నుంచి ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తల్లిదండ్రల మాటను గౌరవించి కొంతకాలం తరువాత వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఆ యువతి భావించింది. అయితే తనతో కలిసి తిరగడానికి తన ప్రియురాలు రావడం లేదని కసితో రగిలిపోయిన ప్రియుడు పక్కా స్కెచ్ వేసి దారుణానికి పాల్పడ్డాడు. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చంపేసి నదీకాలువలోకి విసిరేశాడు.

Illegal affair: రాత్రి కారులో ప్రియుడితో భార్య రొమాన్స్, భర్త వీడియో కాల్ చేశాడు, కట్ చేస్తే !

రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో !

రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో !

ఉత్దర్ ప్రదేశ్ లో నేరాలు, ఘోరాలు ఏ లెవల్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో హథ్రాస్ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఇప్పటికి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్దర్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో బారాబంకి జిల్లా కేంద్రం ఉంది. ఈ బారాబంకి ప్రాంతంలో 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది.

 మైనర్ తో ప్రేమాయణం

మైనర్ తో ప్రేమాయణం

బారాబంకి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న రామ్ యాదవ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు 17 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు. రామ్ యాదవ్ ను ఆ మైనర్ ప్రేమిస్తున్నది. దాదాపు సంవత్సరం నుంచి యువతి, రామ్ యాదవ్ చట్టాపట్టాలు వేసుకుని కలిసిమెలసి తిరుగుతున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ కావడంతో అడ్వాన్స్ గా అన్నీ జరిగిపోయాయి.

నో.... మేము ఒప్పుకోము

నో.... మేము ఒప్పుకోము

రామ్ యాదవ్ ను తమ కుమార్తె ప్రేమిస్తున్నదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిని మందిలించారు. రామ్ యాదవ్ పనిపాట లేకుండా తిరుగుతున్నాడని, అతనితో నువ్వు తిరగడానికి వీల్లేదని, ఈ పెళ్లికి మేము అంగీకరించమని యువతి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. అయితే రామ్ యాదవ్ అంటే ఎక్కువ ఇష్టపడిన యువతి అయోమయంలో పడిపోయింది.

 ప్రియురాలి ప్లాన్ ఒకటి..... ప్రియుడి ప్లాన్ ఇంకోటి

ప్రియురాలి ప్లాన్ ఒకటి..... ప్రియుడి ప్లాన్ ఇంకోటి

కొంతకాలం తల్లిదండ్రులు చెప్పినట్లు వింటే అన్నీ సర్దుకుంటాయని, తరువాత వారిని ఒప్పించి రామ్ యాదవ్ ను పెళ్లి చేసుకోవచ్చని ఆ యువతి ఆలోచించింది. రామ్ యాదవ్ తో తిరగరాదని చెప్పిన తల్లిదండ్రుల మాటకు కట్టుబడి కొంతకాలం నుంచి ప్రియుడు రామ్ యాదవ్ ను కలవకుండా అతనికి ఆమె దూరంగా ఉంది. అయితే తన ప్రియురాలు తనను మోసం చేసిందని, ఎలాగైనా బుద్దిచెప్పాలని రామ్ యాదవ్ మరో ప్లాన్ వేశాడు.

ఫ్రెండ్స్ తో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్..... హత్య

ఫ్రెండ్స్ తో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్..... హత్య

వారం రోజుల క్రితం యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన రామ్ యాదవ్ అతని స్నేహితులతో కలిసి యువతిని కిడ్నాప్ చేసి నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లారు. ప్రియురాలి మీద ఆమె ప్రియుడు, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. యువతి విషయం బయటకు చెబుతుందనే భయంతో ఆమెను చంపేసి నదీకాలువలో విసిరేసి పరారైనారు, మరుసటి రోజు నదీ కాలువలో యువతి శవం తేలుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇలాంటి ప్రియుడు ఉంటాడా ?

ఇలాంటి ప్రియుడు ఉంటాడా ?

పోలీసుల విచారణలో హత్యకు గురైన యువతికి రామ్ యాదవ్ అనే ప్రియుడు ఉన్నాడని వెలుగు చూసింది. ప్రియుడు రామ్ యాదవ్ వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ప్రియురాలు తనను మోసం చేసిందని కోపంతో ఆమెను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసి చంపేసి శవాన్ని నదీకాలువలోకి విసిరేశామని ప్రియుడు రామ్ యాదవ్ అంగీకరించాడని బారాబంకి పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉంది.

English summary
Girlfriend: A 17-year-old girl was gang raped and murdered by her boyfriend and his accomplice because she had been refusing to meet him, the police in Uttar Pradesh's Barabanki district - just 30 km from capital Lucknow - said on Tuesday. The victim's family was opposed to their relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X