Girlfriend: నిలువునా ముంచేసిన ప్రియురాలు, మొబైల్ లో స్టేటస్ పెట్టి ప్రియుడు !

బెంగళూరు/కోలారు: కాలేజ్ లో చదువుతున్న యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. యువతి కూడా అతన్ని ప్రేమించింది. యవ్వనంలో ఉన్న ప్రేమికులు హ్యాపీగా తిరిగారు. ప్రేమికులు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని వాళ్ల స్నేహితులు అనుకున్నారు, అయితే ప్రియురాలు ఆమె ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ప్రియురాలిని దక్కించుకోవాలని కాలేజ్ అబ్బాయి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే మద్యలో ఏం జరిగిందో ఏమో కాని ప్రియురాలు మాత్రం ప్రియుడి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి అతని వైపు కన్నెత్తికూడా చూడలేదు. ప్రేమించి నాలాగా బకరాలు కావద్దు, బుద్దిగా తల్లిదండ్రులు చెప్పినట్లు వినండి, ప్రేమ, ప్రియురాలు అంటూ అమ్మాయిల వెంట తిరిగితే నాగతే మీకు పడుతుంది, ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త అంటూ వాట్సాప్ స్టేటస్ లో మెసేజ్ పెట్టిన కాలేజ్ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం కలకం రేపింది.

 కాలేజ్ అబ్బాయి

కాలేజ్ అబ్బాయి

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని ముళబాగిలు సమీపంలోని హైదలాపుర గ్రామంలో హేమంత్ రెడ్డి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో చదువుతున్న హేమంత్ రెడ్డి చాలా హుషారుగా ఉండేవాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న హేమంత్ రెడ్డి ఇంటిలో కుటుంబ సభ్యులకు పోలం దగ్గర సహాయం చేస్తున్నాడు.

 లవ్ లో పడిన యువకుడు

లవ్ లో పడిన యువకుడు

కాలేజ్ లో చదువుతున్న హేమంత్ రెడ్డి ఓ యువతిని ప్రేమించాడు. యువతి కూడా హేమంత్ రెడ్డిని ప్రేమించింది. ఇంతకాలం ప్రేమికులు హ్యాపీగా తిరిగారు. హేమంత్ రెడ్డి అతని ప్రియురాలితో ఇంతకాలం సినిమాలు, షికార్లకు తిరిగాడు. హేమంత్ రెడ్డి, అతని ప్రియురాలు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని వాళ్ల స్నేహితులు అనుకున్నారు,

 చేతులు ఎత్తేసిన ప్రియురాలు

చేతులు ఎత్తేసిన ప్రియురాలు

కొన్ని నెలల క్రితం ప్రియురాలు హేమంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది. ప్రియురాలిని దక్కించుకోవాలని కాలేజ్ అబ్బాయి హేమంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే మద్యలో ఏం జరిగిందో ఏమో కాని ప్రియురాలు మాత్రం హేమంత్ రెడ్డి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి అతని వైపు కన్నెత్తికూడా చూడలేదు.

 మొబైల్ స్టేటస్ లో మెసేజ్ పెట్టి ఆత్మహత్య

మొబైల్ స్టేటస్ లో మెసేజ్ పెట్టి ఆత్మహత్య

ప్రియురాలు మోసం చెయ్యడంతో హేమంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రేమించి నాలాగా పిచ్చోళ్లు కావద్దు, బుద్దిగా మీ తల్లిదండ్రులు చెప్పినట్లు వినండి, ప్రేమ, ప్రియురాలు అంటూ అమ్మాయిల వెంట తిరిగే నాగతే మీకు పడుతుంది, ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ వాట్సాప్ స్టేటస్ లో మెసేజ్ పెట్టిన హేమంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

 నా ప్రియురాలు సంతోషంగా ఉండాలి

నా ప్రియురాలు సంతోషంగా ఉండాలి

నా ప్రియురాలు ఎక్కడ ఉన్నా, ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆమె క్షేమంగా, సంతోషంగా ఉండాలి, నాకు ఎవరి మీద కోపం లేదు అని హేమంత్ రెడ్డి మెసేజ్ పెట్టడంతో అతని స్నేహితులు షాక్ అయ్యారు. హేమంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మొబైల్ స్టేటస్ మెసేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన ముళబాగిలు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+