వైన్ షాపులకు గిరాకీ పెరగాలంటే.. అమ్మాయిల పేర్లు పెట్టండి: మహారాష్ట్ర మంత్రి

మద్యం విక్రయాలకు గిరాకీ బాగా రావాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలని సూచించారు.

ముంబై: ఓవైపు మద్యపానాన్ని నిషేధించాలని మహిళలంతా పోరాడుతుంటే.. మరోవైపు బాధ్యాతయుతమైన మంత్రి పదవిలో ఉండి మహారాష్ట్ర మినిస్టర్ గిరీష్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీకి చెందిన ఓ మద్యం వ్యాపారి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యాపారి తన మద్యం దుకాణాలన్నింటికి 'మహారాజా' అని పేరు పెట్టుకోవడాన్ని మంత్రి గిరీష్ ప్రస్తావించారు.

Give booze women's names to boost sales', says minister in Maharashtra BJP govt

మద్యం విక్రయాలకు గిరాకీ బాగా రావాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలని సూచించారు. చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారని, పొగాకు ఉత్పత్తులు అంతగా అమ్ముడు పోవ‌డానికి వాటికి మహిళల పేర్లు పెట్టడమే కార‌ణ‌మ‌ని మంత్రి గిరీష్ పేర్కొనడం గమనార్హం. మద్యం షాపులకు గిరాకీ పెరగాలంటే 'మహారాజా' అని కాకుండా మహారాణి అని మార్చుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+