Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GOA elections: ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్; లైంగిక ఆరోపణలతో మంత్రి రాజీనామా!!

ఒక పక్క ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గోవా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, గోవాలో అధికార బిజెపికి ఊహించని దెబ్బ తగిలింది. గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గోవా మంత్రి అయిన మిలింద్ నాయక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఆయనను పదవి నుండి తప్పించాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గోవా అర్బన్ డెవలప్మెంట్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మిలింద్ నాయక్ బుధవారం సాయంత్రం మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మిలింద్ నాయక్ రాజీనామా .. ఆమోదించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

మిలింద్ నాయక్ రాజీనామా .. ఆమోదించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

బుధవారం అర్థరాత్రి, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మిలింద్ నాయక్ స్వేచ్ఛగా మరియు న్యాయమైన దర్యాప్తు కోసం తన రాజీనామాను సమర్పించారని తాను దానిని ఆమోదించానని వెల్లడించారు. కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలు చూపించినా విచారణ జరుపుతామని గోవా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాయక్ తనపై వచ్చిన ఆరోపణలపై తన పక్షాన నిలబడి పోరాటం చేస్తారని, వ్యక్తిగత స్థాయిలో పోరాడతాడని గోవా ముఖ్యమంత్రి వెల్లడించారు. తనపై చేసిన ఆరోపణలు వ్యక్తిగతమైనవి కాబట్టి దానిపై అతను ఏం చెబుతారో వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన అంశం అని ప్రమోద్ సావంత్ అన్నారు. ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏదైనా 100 శాతం చేయబడుతుంది అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. గతంలో నాయక్ నిర్వహించిన మంత్రి పదవి ఖాళీగానే ఉంటుందని ఆయన అన్నారు.

బీహార్ కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన మంత్రి.. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ గోవా అధ్యక్షుడు

బీహార్ కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన మంత్రి.. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ గోవా అధ్యక్షుడు

గోవా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ బుధవారం నాయక్‌ను లైంగిక ఆరోపణలు ఉన్న మంత్రిగా పేర్కొన్నారు. మంత్రి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని, బీహార్‌కు చెందిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు గిరీష్ చోడంకర్. నవంబర్ 30న, చోడంకర్ ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని ఒక మంత్రి "సెక్స్ కుంభకోణం"లో ఉన్నారని ఆరోపించారు. మంత్రిపై చర్య తీసుకోవడానికి బిజెపి ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నామని అల్టిమేటం జారీ చేశారు.

 మిలింద్ నాయక్ పై ఆరోపణలు.. ఆ వీడియోలు, ఆడియో బయటపెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

మిలింద్ నాయక్ పై ఆరోపణలు.. ఆ వీడియోలు, ఆడియో బయటపెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు


పదిహేను రోజులు గడిచిన తర్వాత చోడంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మంత్రివర్గం నుండి మంత్రిని తొలగించకపోతే, అతని పేరును బయటపెట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒత్తిడి రాగా గిరీష్ చోడంకర్ మిలింద్ నాయక్ పేరును బయటపెట్టారు.దక్షిణ గోవాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంకల్ప్అమోంకర్ తో పాటు ఇతర పార్టీ సభ్యులు డిసెంబర్ 10వ తేదీన గోవా మంత్రి మిలింద్ నాయక్ ఒక మహిళపై లైంగిక వేధింపులు మరియు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, నిందితుడైన మంత్రి నిర్వాకానికి సంబంధించిన వీడియోలు, ఆడియోను విడుదల చేశారు.

 గోవా ఎన్నికల ముందు బీజేపీకి షాక్ .. మంత్రి రాజీనామా ఎఫెక్ట్

గోవా ఎన్నికల ముందు బీజేపీకి షాక్ .. మంత్రి రాజీనామా ఎఫెక్ట్

పనాజీలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారు సెల్ ఫోన్ రికార్డులు మరియు మంత్రి మహిళను లైంగికంగా వేధించారని మరియు ఆమెను బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించిన ఆధారాలు సమర్పించారు. ఇక ఇదే సమయంలో మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా మంత్రి పై చర్యలు తీసుకోకుంటే ఆయన ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోవా మంత్రి మిలింద్ నాయక్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నాయక్ రాజీనామా చేయడం ఫిబ్రవరి, 2022లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ముందు గోవాలోని బిజెపి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారవచ్చు. యాభై ఎనిమిదేళ్ల మిలింద్ నాయక్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు . 2012లో హౌసింగ్ మంత్రి గా పని చేశారు. దక్షిణ గోవాలోని మోర్ముగావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+