వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బై బై టూ అమెరికా: యూఎస్‌ను కాదని కెనడాకు మళ్లిన భారతీయ ప్రతిభ, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు భారతీయులు చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లారంటే అది అమెరికానే అయి ఉండేది. కానీ, ఇప్పుడు భారతీయులు రూటు మార్చారు. అమెరికా పక్కనే ఉన్న మరో అపార అవకాశాల దేశం కెనడాకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఆ దేశం కూడా భారతీయులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుతుండటం గమనార్హం.

అమెరికా వీసా విధానమే భారతీయులను దూరం చేస్తోందా?

అమెరికా వీసా విధానమే భారతీయులను దూరం చేస్తోందా?

భారతీయ నిపుణులందరూ కెనడాకు వెళుతుండటంతో అమెరికా దేశంలో కొంత కలవరపాటు మొదలైంది. అంతేగాక, చట్టసభల సభ్యులు కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. అమెరికా అనుసరిస్తున్న పాత కాలం వీసా విధానం, ముఖ్యంగా హెచ్1 బీ వీసాల జారీ విషయంలో అనుసరిస్తున్న పద్ధతి కారణంగానే ప్రతిభగల భారతీయులు అమెరికాకు రాకుండా కెనడాను ఎంచుకుంటున్నారని అమెరికా ప్రభుత్వ పెద్దలను ఆ దేశ నిపుణులు అప్రమత్తం చేశారు.

భారీ దెబ్బకొట్టిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు విధానాలు

భారీ దెబ్బకొట్టిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు విధానాలు

చైనా తర్వాత అమెరికాలో భారతీయ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. 1.93 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నత చదువులను అభ్యసిస్తున్నారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో అమెరికాలోని విశ్వవిద్యాలయాలు కొత్త చట్టాలకు అనుగుణంగా వీసాలను తగ్గించి వేశాయి. ఇక్కడే విద్యనభ్యసించి ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ట్రంప్ ప్రభుత్వం విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం(అక్టోబర్ 2019-సెప్టెంబర్ 2020) కరోనావైరస్ మహమ్మారి కారణంగా 64 శాతం స్టూడెంట్ వీసాలను అమెరికా ప్రభుత్వం తగ్గించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) తెలిపిన వివరాల ప్రకారం.. 2019 ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతం భారతీయ విద్యార్థులకు అనుమతివ్వలేదు. 25 శాతం భారతీయ విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇది జరగడం గమనార్హం.

భారతీయులు అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల ఎదరుచూపులు

భారతీయులు అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల ఎదరుచూపులు

మరోవైపు అమెరికాలో చాలా ఏళ్లుగా నివాసం ఉండే భారతీయులకు గ్రీన్ కార్డులు ఇవ్వడంలో అత్యంత జాప్యం జరుగుతూ వచ్చింది. ఇది కూడా భారతీయులను అమెరికాకు దూరం చేసిందని ఇమ్మిగ్రేషన్, విధాన నిపుణలు వెల్లడించారు. ఒక దశాబ్ద కాలంలో పెండింగ్‌లో గ్రీన్ కార్డుల సంఖ్య 20 లక్షలకు పెరగడం గమనార్హం. ఇక అమెరికా పౌరుడు కావాలంటే సంవత్సరాలు, దశాబ్దాలు వేచిచూడక తప్పదనే అభిప్రాయానికి భారతీయులు వచ్చేశారు.

అమెరికా నుంచి కెనడాకు మళ్లిన భారతీయ ప్రతిభ.. ఎందుకంటే..?

అమెరికా నుంచి కెనడాకు మళ్లిన భారతీయ ప్రతిభ.. ఎందుకంటే..?

ఈ కారణాలతోనే అమెరికాకు దూరమవుతున్న భారతీయులు కెనడా వైపు చూస్తున్నారు. కెనడాలోనూ ఉన్నత ప్రమాణాలు కలిగిని యూనివర్సిటీలు ఉన్నాయి. ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుత సమయంలో కరోనావైరస్ మహమ్మారిని సమర్థంగా నియంత్రిస్తున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. న్యూజిలాండ్ దేశాధినేత జెసిండా అర్డెర్న్ కూడా ఆ దేశంలో కరోనాను అరికట్టారు. దీంతో ఆ దేశంవైపు కూడా కొందరు విద్యార్థులు వెళుతున్నారు. ఆ తర్వాత కెనడా, ఆస్ట్రేలియాలో వరుసలో ఉన్నాయి. అయితే, కెనడాలో అనేక విశ్వవిద్యాలయాలు అమెరికా కంటే తక్కువ వ్యయంతోనే కోర్సులను అందిస్తున్నాయి. అంతేగాక, ఇక్కడి వర్సిటీలు పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తున్నాయి. ఇక కెనడా ప్రభుత్వం కూడా భారతీయ విద్యార్థులకు, నిపుణులకు స్వాగతం పలుకుతోంది. అక్కడి చట్టాలు కూడా వలసదారులకు అనుకూలంగా ఉండటంతో భారతీయలు కెనడాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

English summary
Going to US is over, now the indian talent is moving to Canada, Here is why?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X