దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యం
చెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని తిరువనైకావల్‌లో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయంలో బుధవారం జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడ్డాయి.
ఈ మొత్తం నాణేల్లో 504 చిన్నవి కాగా, ఒకటి మాత్రం పెద్దగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. క్రీస్తుశకం 1000 నుంచి 1200కు చెందినవిగా అంచనా వేస్తున్నారు.

దేవాలయం పరిసరాల్లో తవ్వకాలు జరుపుతుండగా ఏడు అడుగుల లోతులో ఓ మట్టి పాత్రలో ఈ నాణేలు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. పాత్రతో సహా బంగారు నాణేలను పోలీసులకు అప్పగించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వీటిని ప్రభుత్వ ట్రెజరీకి తరలించి తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications