Airpor: షార్జా నుంచి దర్జాగా వచ్చాడు, ఎక్కడా చోటులేదని విగ్ లో పెట్టుకుని, బట్టతల తెలివి తెల్లారింది !
లక్నో: బంగారం, డ్రగ్స్, నిషేధిత పదార్థాలు సరఫరా చేస్తున్న వారిని అధికారులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అధికారులు ఎంతమందిని అరెస్టు చేస్తున్నా నిందితులు మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. మలమూత్ర విసర్జన చేసే రంధ్రాల్లో బంగారు, డ్రగ్స్ పెట్టుకుని వచ్చి ఇప్పటికే అడ్డంగా బుక్కైపోయిన వారి విషయం మనకు తెలిసిందే. రానురాను నిందితులు వేస్తున్న ఐడియాలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. తన అందం రెట్టింపుకావాలని ఓ బట్టతల ఉన్న వ్యక్తి విగ్ పెట్టుకున్నాడు. విదేశాల నుంచి వచ్చిన ఆయన ఎయిర్ పోర్టులో దర్జాగా నడుచుకుంటూ వెలుతున్నాడు.
అతన్ని చూసిన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆయన్ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాత్రం తడబాటుపడటం, అక్కడి నుంచి జారుకోవాలని చూడటంతో కస్టమ్స్ అధికారులకు ఇంకా అనుమానం వచ్చింది. వెంటనే ఆయనగారు పెట్టుకున్న విగ్ తీసి చూస్తే అందులో లక్షల రూపాయల విలువైన బంగారు ఉన్న విషయం వెలుగు చూడటంతో సాటి ప్రయాణికులు షాక్ అయ్యారు.

అతి తెలివితో అడ్డంగా చిక్కిపోతున్నారు
బంగారం, డ్రగ్స్, నిషేధిత పదార్థాలు సరఫరా చేస్తున్న వారిని అధికారులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అధికారులు ఎంతమందిని అరెస్టు చేస్తున్నా నిందితులు మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. మలమూత్ర విసర్జన చేసే రంధ్రాల్లో బంగారు, డ్రగ్స్ పెట్టుకుని వచ్చి ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో అడ్డంగా బుక్కైపోయిన వారి విషయం మనకు తెలిసిందే.

షార్జా టూ లక్నో ఎయిర్ పోర్ట్
నిందితులు వేస్తున్న ఐడియాలు చూసి కస్టమ్స్, ఆదాయపన్ను శాఖ అధికారులు షాక్ అవుతున్నారు. తన అందం రెట్టింపుకావాలని ఓ బట్టతల ఉన్న వ్యక్తి విగ్ పెట్టుకున్నాడు. షార్జా నుంచి నుంచి బీహార్ లోని లక్నో ఎయిర్ పోర్టు వచ్చిన ఆయన ఎయిర్ పోర్టులో దర్జాగా నడుచుకుంటూ వెలుతున్నాడు. అతన్ని చూసిన ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.

విగ్ లో రూ. 15 లక్ష బంగారం
వెంటనే ఆయన్ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాత్రం తడబాటుపడటం, అక్కడి నుంచి జారుకోవాలని చూడటంతో కస్టమ్స్ అధికారులకు ఇంకా అనుమానం వచ్చింది. వెంటనే ఆయనగారు పెట్టుకున్న విగ్ తీసి చూస్తే అందులో రూ. 15. 42 లక్షల రూపాయల విలువైన బంగారు ఉన్న విషయం వెలుగు చూడటంతో సాటి ప్రయాణికులు షాక్ అయ్యారు. విగ్ లోపల నల్లగి ప్లాసర్ చుట్టిన బంగారు ఉందని అధికారులు చెప్పారు.

బుర్కాలో బంగారం
నిందితుడిని అరెస్టు చేసి బంగారు స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిచామని, అతన్ని రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని అధికారులు చెప్పారని ఎన్ఏఎన్ఎస్ మీడియా సంస్థ తెలిపింది. గత నెలలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బర్కాలో అక్రమంగా బంగారం పెట్టుకున్న వెలుతున్న మహిళ పోలీసులకు చిక్కిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications