పీఎం కిసాన్ పై రైతులకు శుభవార్త.. ఖాతాలలో డబ్బులు అప్పుడే!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ పథకంలో మూడు విడతలుగా రైతులకు వ్యవసాయానికి, పంట పెట్టుబడికి కావలసిన ఆర్థిక భరోసా లభిస్తుంది. సంవత్సరానికి 6000 చొప్పున మూడు విడతలలో ప్రతీ విడత 2 వేల రూపాయల చొప్పున ఈ డబ్బు అందుతుంది.
పీఎం కిసాన్ పై కొత్త అప్డేట్
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు దీపావళికి ముందుగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అంతా ఎదురు చూశారు. గతంలో దీపావళికి ముందే డబ్బులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి దీపావళికి ముందు డబ్బు రైతుల ఖాతాలలో పడలేదు. దీంతో పీఎం కిసాన్ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దీనిపైన కొత్త అప్డేట్ వచ్చింది.

దీపావళికి ముందు ఆశగా చూసిన రైతులు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల కోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు నిరీక్షిస్తున్న వేళ ఈ నిధుల విడుదలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ వంటి వరద ప్రభావిత ప్రాంతాలలో 21వ విడత నిధులను మంజూరు చేశారు. అయితే మిగిలిన చోట కూడా దీపావళికి ముందుగానే ఈ నిధులు విడుదల అవుతాయని రైతులు ఆశగా ఎదురు చూశారు.
నవంబర్ లో నిధుల విడుదలకు ఛాన్స్
కానీ పీఎం కిసాన్ నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ మాసంలో నిధులు విడుదలవుతాయని నేషనల్ మీడియా చెబుతోంది. నవంబర్ మొదటి వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపింది. బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు నవంబర్ 6కు ముందే కేంద్రం దీనిపైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపింది.
నవంబర్ లో రైతులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్తుందా?
అయితే దీనికి సంబంధించి మోడీ సర్కార్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎప్పటివరకు రైతుల ఖాతాలలో డబ్బులు పడతాయో వెల్లడించలేదు. పీఎం కిసాన్ 21వ విడత నిధులు త్వరలోనే పడతాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నవంబర్ మొదటివారం శుభవార్త చెబుతుందో లేదో వేచి చూడాల్సిందే.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications