సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ పై రైల్వే శుభవార్త!
భారతీయ రైల్వేలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వందే భారత్ రైళ్ల గురించి రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. రైల్వే బోర్డు వందే భారత్ రైళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఏడు కీలక మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లకు అదనపు బోగీలను చేర్చాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రూట్లలో వందే భారత్ కు విపరీతమైన డిమాండ్
డిమాండ్ ఉన్న మార్గాల్లో మరిన్ని కోచ్‌లతో రైళ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. సికింద్రాబాద్ తిరుపతి, మంగుళూరు సెంట్రల్ తిరువనంతపురం సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ తిరునల్వేలి, మధురై బెంగళూరు క్యాంట్, డియోఘర్ వారణాసి, హౌరా రూర్కెలా, ఇండోర్ నాగపూర్ ఈ ఏడు రూట్లలో ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది.

మరిన్ని కోచ్ లతో వందే భారత్ రైళ్ల అప్గ్రేడ్
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఈ రూట్ లలో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాలలో మరిన్ని కోచ్ లతో వందే భారత్ రైళ్లను అప్గ్రేడ్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది . ప్రస్తుతం ఈ మార్గాల్లో నాలుగు 8 కోచ్‌ల వందే భారత్ రైళ్లు, మూడు 16 కోచ్‌ల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
రైళ్ళ అప్గ్రేడేషన్ కు రైల్వే బోర్డు ప్రణాళిక
రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ దీని గురించి మాట్లాడుతూ,16 కోచ్‌ల రైళ్లను 20కోచ్‌లకు, 8 కోచ్‌ల రైళ్లను 16కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేస్తాం అని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2025-26 లో ఆక్యుపెన్సీ, వృద్ధి అవకాశాలను బట్టి, మూడు 16 కోచ్‌ల వందే భారత్ రైలు సర్వీసులను 20 కోచ్‌లకు, నాలుగు 8 కోచ్‌ల వందే భారత్ రైళ్లను 16కోచ్‌లకు విస్తరించాలని తాత్కాలికంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ మూడు రూట్లలో వందే భారత్ రైళ్ళు 20 కోచ్ లతో అప్గ్రేడ్
ఈ రూట్లలో రైలు సర్వీసులను అప్గ్రేడ్ చేయడంతోపాటు, మరిన్ని 20 కోచ్ ల వందే భారత్ రైళ్లను త్వరలో ప్రారంభిస్తామని ఆయన అన్నారు. రైల్వే బోర్డు నిర్ణయం మేరకు షెడ్యూల్ చేసిన అప్గ్రేడేషన్ ప్రకారం ప్రస్తుతం మంగళూరు సెంట్రల్ తిరువనంతపురం సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ తిరునల్వేలి, సికింద్రాబాద్ తిరుపతి మార్గాల లోని మూడు రైళ్లను 20 కోచ్ లకు అప్గ్రేడ్ చేస్తారు.
ప్రయాణికులకు వందే భారత్ శుభవార్త
మధురై బెంగళూరు క్యాంట్, డియోఘర్ వారణాసి, హౌరా రూర్కెలా, ఇండోర్ నాగపూర్ రూట్ లలోని వందే భారత్ రైళ్లను ఎనిమిది కోచ్ ల నుండి 16 కోచ్ లకు అప్గ్రేడ్ చేస్తారు. మొత్తంగా డిమాండ్ ఉన్న మార్గాల్లో వందే భారత్ సేవలను విస్తరించే ప్లాన్ చేసిన రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications