భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యంలో తెరుచుకోనున్న ఆ ద్వారాలు..

ఒడిశాలో కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం పూరీ జ‌గ‌న్నాథ ఆల‌య భ‌క్తుల‌కు ఓ శుభ‌వార్త‌ను అందించింది. 12 వ శతాబ్దం నాటి ఈ ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఒక్క ద్వారం నుంచే భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌నీ, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక‌, నేటి (గురువారం ) నుంచి ఈ ఆల‌యంలోని నాలుగు ద్వారాల ద్వారా జ‌గ‌న్నాథుని ద‌ర్శ‌నం భాగ్యం పొందొచ్చు.

వీటితో పాటు మ‌రికొన్ని నిర్ణ‌యాలను కూడా తీసుకున్నారు. రూ.500 కోట్లతో ఆలయానికి కార్పస్ ఫండ్ ఏర్పాటుకు కొత్త ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. బుధ‌వారం నాడు ఒడిశా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మోహన్ చరణ్ మాఝి ఈ కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు. ప్ర‌మాణస్వీకారం పూర్త‌యిన‌ వెంటనే.. ఒడిశా సెక్రెటేరియట్ లోక్‌సేవా భవన్‌లో తొలి క్యాబినెట్ సమావేశం నిర్వ‌హించారు. ఈ బేటీలో పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై చ‌ర్చించారు. ఇందులో మొద‌ట‌గా పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యానికి సంబంధించిన కీల‌క నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింది. 12 వ శతాబ్దం నాటి ఈ ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక్క ద్వారం నుంచే భక్తులను లోపలికి వెళ్తున్నారు.

Good news for the devotees those gates are going to open in Puri Jagannath Temple

కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తులు లోప‌లికి వెళ్ల‌డం వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక నుంచి నాలుగు ద్వారాల ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చ‌ని అధికారులు తెలిపారు. నేటి (గురువారం) ఉదయం నుంచే ఆలయ నాలుగు ద్వారాలు తెరుచుకోనున్నాయి. అలాగే, వీటితోపాటు రూ.500 కోట్లతో ఆలయానికి కార్పస్ ఫండ్ ఏర్పాటుకు కూడా ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈ ఫండ్‌ను ఏర్పాటు చేయాల‌ని క్యాబినెట్ నిర్ణయించిందని మాఝీ చెప్పారు. క్యాబినెట్ సమావేశం పూర్త‌యిన వెంటనే బుధవారం రాత్రి ఒడిశా మంత్రులంద‌రూ పూరీకి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+