వాళ్లనే గవర్నర్ పిలవాలి: కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన
బెంగళూరు: కకర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన స్పందించింది. మెజార్టీ ఎవరికి ఉంటే వారిని గవర్నర్ పిలవాలని చెప్పింది. తద్వారా గవర్నర్ తీరును తప్పుబట్టింది. జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ ఉందని శివసేన అభిప్రాయపడింది.
యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని అభిప్రాయపడింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా బలం నిరూపించుకోవడం అంత ఈజీ కాదన్నారు. అలాగే, కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నా 2019లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన తెలిపింది.

మరోవైపు, ప్రమాణ స్వీకారం అనంతరం ఫ్లోర్ టెస్ట్ గురించి యడ్యూరప్ప మాట్లాడుతూ.. రేపటి వరకు లేదా ఎల్లుండి వరకు వేచి చూడండి అని వ్యాఖ్యానించారు.
కాగా, కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాల్లో గెలిచింది. శాసన సభలో బలం నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నారు.
BS Yeddyurappa has taken the oath but it's difficult to prove majority. Governor should have called those who had maximum numbers. When this happens people say, loktantra ki hatya ho gayi, lekin jab desh mein loktantra bacha hi nahi hai toh hatya kiski hogi:Sanjay Raut, Shiv Sena pic.twitter.com/Ja2tTABDBM
— ANI (@ANI) May 17, 2018












Click it and Unblock the Notifications