Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏప్రిల్1: మోదీ సర్కార్ మరో షాక్ -సుకన్య, పీపీఎఫ్ లాంటి చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గింపు

అధిక ధరల భారం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కరోనా విలయం తదితర ఇబ్బందులతో విలవిల్లాడుతోన్న దేశ ప్రజలకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో భారీ షాకిచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వారికి చేదు వార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి 'స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌'పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటన చేసింది.

కరోనా విలయ కాలంలోనూ కొంతలో కొంత ఉపశమనంగా గడిచిన మూడు త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిన కేంద్రం.. ఇప్పుడు వాటిని తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది, స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను 40 నుంచి 110 బేసిస్ పాయింట్ల మధ్యలో కోత విధించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే,

Govt cuts interest rates on small savings schemes effective from April 1

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్ఎఫ్) వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు. పీపీఎఫ్ వడ్డీ రేటు 7 శాతం కంటే కిందకు రావడం గడిచిన 46 ఏళ్లల్లో ఇదే తొలిసారి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీ రేటును కూడా 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పొదుపు పథకాలను కూడా కేంద్రం వదల్లేదు..

బాగా పాపులరైన సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు. ఇక పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 1.1 శాతం వరకు తగ్గింది. వీటిపై వడ్డీ రేటు 4.4 శాతం నుంచి 5.3 శాతం మధ్యలో ఉంది. గత ఏడాది కాలంలో మోదీ సర్కార్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+