షాకింగ్: వెన్నునొప్పి అని వెళితే.. రాళ్లకు బదులు కిడ్నీనే తొలగించిన వైద్యులు, రూ. 11 లక్షల పరిహారం

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ జిల్లాలోని ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. తన కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి వైద్యులు చికిత్స చేశారు. అయితే, రాళ్లు తీసేయాల్సిందిపోయి ఏకంగా ఆ వ్యక్తి కిడ్నీనే తొలగించేశారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన బాలసినోర్‌లోని కేఎంజీ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

వెన్నునొప్పి, యూరిన్ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు..

వెన్నునొప్పి, యూరిన్ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2011లో ఖేడా జిల్లాలోని వంఘ్రోలి గ్రామానికి చెందిన దేవేంద్రభాయి రావల్ అనే వ్యక్తి బాలసినోర్‌లోని కేఎంజీ జనరల్ ఆస్పత్రిలో చేరాడు. విపరీతమైన నడుము నొప్పి, మూత్రం చేస్తున్న సమయంలో నొప్పి ఉందని వైద్యులకు తెలిపాడు. తన కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని వైద్యులకు చెప్పాడు.

రాళ్లకు బదులు ఏకంగీ కిడ్నీనే తొలగించిన వైద్యుడు

రాళ్లకు బదులు ఏకంగీ కిడ్నీనే తొలగించిన వైద్యుడు

ఈ క్రమంలో దేవేంద్రభాయి రావల్‌ను పరీక్షించిన వైద్యులు ఎడమ కిడ్నీలో 15ఎంఎం స్టోన్ ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 3, 2011లో రావల్‌కు ఆపరేషన్ చేశారు. అయితే, రాళ్లకు బదులు ఏకంగా అతని కిడ్నీనే తొలగించారు వైద్యుడు. అంతేగాక, బాధితుడి బాగు కోసమే తాను రాళ్లకు బదులు కిడ్నీ తొలగించినట్లు బాధితుడి కుటుంబసభ్యులకు చెప్పారు.

ఆ తర్వాత సమస్య తీవ్రం.. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు

ఆ తర్వాత సమస్య తీవ్రం.. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు

అయితే, ఆ తర్వాత బాధితుడు రావాల్ మూత్రం చేసేటప్పుడు మరింతగా సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో బాధ భరించలేక నడియడ్‌లోని ఓ కిడ్నీ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అతడ్ని అహ్మదాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్(ఐకేడీఆర్సీ)కి పంపించారు. అక్కడే చికిత్స పొందుతూ మూత్రపిండాల సమస్యతో దేవేంద్రభాయి రావల్ మరణించాడు.

Recommended Video

    Noorjahan Mango Costs ₹ 1,000 Per Piece|Madhya Pradesh | Oneindia Telugu
    రూ. 11 లక్షల పరిహారం ఇవ్వాలంటూ వినియోగదారుల కమిషన్ ఆదేశం

    రూ. 11 లక్షల పరిహారం ఇవ్వాలంటూ వినియోగదారుల కమిషన్ ఆదేశం

    ఈ నేపథ్యంలో బాధితుడి బంధువులు గుజరాత్ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైడ్యుడిపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాళ్లకు బదులు కిడ్నీ తొలగించి బాధితుడి మరణానికి కారణమయ్యారని మండిపడింది. అంతేగాక, కేఎంజీ జనరల్ ఆస్పత్రిని బాధితుడి కుటుంబానికి రూ. 11.23 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2012 నుంచి 7.5 శాతం వడ్డీతో కలిపి పరిహారం చెల్లించానలి స్పష్టం చేసింది. వైద్యుడి నిర్లక్ష్యానికి ఆస్పత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ తేల్చి చెప్పింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+