ఏకధాటిగా భారీ వర్షాలు- ఈదురుగాలులకు జనం బెంబేలు
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ బిపర్‌జాయ్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది. అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీర ప్రాంతాలు గజగజ వణికిపోతోన్నాయి. తుఫాన్ తీవ్రత అంచనాలకు మించి ఉండొచ్చంటూ వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది.
Another video of 🌀 Cyclone Biparjoy Updates Gujarat on high alert... 📷 #CycloneBiparjoy #CycloneAlert #Biparjoy #biporjoycyclone #JackDorsey #TrumpArraignmentDay #सर्वे_आया_मामा_छाया #TeJran #CycloneBiparjoyUpdate #BiparjoyUpdate #Mbappe 📷 🌀 pic.twitter.com/xGGXKJHv5Q
— Lalji Patel (@LaljiPatel34) June 14, 2023
గురువారం సాయంత్రం జఖావ్ పోర్ట్ వద్ద తీరాన్ని దాటనుంది ఈ బిపర్‌జాయ్ తుఫాన్. దీని ప్రభావం వల్ల ఇప్పటికే పలు జిల్లాల్లో అతి భారీ వర్షలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. 135-145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తోన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో ఈదురుగాలుల వేగం 160 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. కచ్ జిల్లాలోని జఖావ్ పోర్ట్ సమీపంలో తీరాన్ని తాకనుంది.

తుఫాన్ సమీపిస్తోన్న కొద్దీ దేవభూమి ద్వారకా నగరం, జఖావ్, పోర్బందర్, మాండ్వి, జామ్‌నగర్, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, మోర్బీ, వల్సాద్ వంటి నగరాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తీరం పోటెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. మత్స్యకార గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేశారు. హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
#WATCH | Visuals from Jakhau Port in Bhuj, where a large number of boats have been parked as fishing has been suspended in the wake of #CycloneBiparjoy.
— ANI (@ANI) June 14, 2023
Cyclone 'Biparjoy' is expected to cross near Gujarat's Jakhau Port by the evening of 15th June pic.twitter.com/KA7OKJE68O
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ప్రభుత్వం తీర ప్రాంతాల నుంచి 30,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేసింది. నౌకా దళాన్ని సన్నద్ధ పరిచింది. అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగడానికి వైమానిక దళ హెలికాప్టర్లను సైతం సిద్ధంగా ఉంచింది గుజరాత్ ప్రభుత్వం. వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో ముందస్తు చర్యల కోసం జవాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముందుజాగ్రత్త చర్యలపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్.. తదితరులు పలుమార్లు సమీక్ష సమావేశాలను నిర్వహించారు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించారు. సౌరాష్ట్ర, కఛ్ సహా తుఫాన్ ప్రభావానికి గురయ్యే అన్ని జిల్లాల్లోనూ అవసరమైనంత ఆహారం, మెడిసిన్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications